చంద్రబాబును ఓడించేందుకు కాపులంతా సిద్ధంగా ఉన్నారు-ముద్రగడ

0
130

అనంత‌పురంః 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు కాపులంతా సిద్ధంగా ఉన్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పారు.అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ,వంగవీటి మోహనరంగాను హత్య చేసిన తర్వాత టీడీపీని కాపులు ఓడించారని చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత మోసం చేశారని మండిపడ్డారు.రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని,13 జిల్లాల కాపు ప్రతినిధులతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.అవసరాన్ని బట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా చర్చలు జరుపుతామని,కాపులను మోసం చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేస్తామని తెలిపారు.

LEAVE A REPLY