కాపు,ఉప‌కులాల‌కు 5 శాతం-రిజ‌ర్వేష‌న్ బిసి (ఎఫ్‌) కేట‌గిరి

0
96

అమ‌రావ‌తిః చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న శుక్ర‌వారం జ‌రిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో కాపు, కాపు ఉపకులాలైన బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.కాపు రిజర్వేషన్ పై వేసిన మంజునాథ కమీషన్ కాపులకు నాలుగు లేదా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చని సూచన చేసినట్టు తెలుస్తోంది. అయితే కేబినెట్ మాత్రం 5 శాతానికి మొగ్గు చూపింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీ మంత్రులను సూచనలు కొరినట్టు తెలుస్తోంది. దీనిపై వారేమీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో కాపు రిజర్వేషన్ కు ఆమోదం లభించిందని తెలుస్తోంది. దీంతో కాపులను బీసీ(ఎఫ్)గా పేర్కోనున్నారు. ఇప్పటికే బీసీల్లో ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బీసీల్లో కాపులను ఎఫ్ గా పేర్కొంది. దీంతో బోయలను ఎస్టీలుగా గుర్తించాలన్న డిమాండ్ కు కూడా సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY