ధాన్యం కోనుగొలు కేంద్రాల‌న ప‌రిశీలించిన జాయింట్ క‌లెక్ట‌ర్‌

0
111

నెల్లూరుః బోగోలు మండ‌లంలోని పొదుపుల‌క్ష్మి,ప్రా.వ్య‌.ప‌.సంఘం అధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ధాన్యం కొనుగొలు కేంద్రంను జాయింట్ క‌లెక్ట‌ర్ ఎ.ఎం.డి ఇంతియాజ్ మంగ‌ళ‌వారం త‌నిఖీచేసి రైతుల‌తో చ‌ర్చించారు.అలాగే జ‌ల‌దంకీ మండ‌లోని పొదుపు ల‌క్ష్మీ గ్రూప్‌ల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ధాన్యం కొనుగొలు కేంద్రంలో రైత‌లు చ‌ర్చించి వారి స‌మస్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.అనంత‌రం కావ‌లి-పెద్ద‌పావ‌ని రైల్వే క్రాసింగ్ వ‌ద్ద నిర్మింస్తున్న రైల్వేఫ్లైవోర్ వ‌ర‌కు సేక‌రించాల‌సిన భూసేక‌ర‌ణ‌కు సంబంధించి 0.33 సెంట్ల భూమిని,క‌ట్ట‌డ‌ల‌ను త‌నిఖీ చేశారు.వ‌రికుంటపాడు మండ‌లంలోని తూర్పు రొంపిదొడ్ల‌,గ‌ణేశ్వ‌ర‌పురం,దామ‌చ‌ర్ల గ్రామాల్లో వెళ్లుతున్న న‌డికుడి-కాళాహ‌స్తీ బి.జి రైల్లేలైన్‌కు ప్ర‌భుత్వ భూముల‌ను,అసైన్‌మెంట్ భూముల‌ను ప‌రిశీలించారు.ఈకార్య‌క్ర‌మంలో కావ‌లి ఆర్డీఓ భ‌క్త‌వ‌త్స‌ల‌రెడ్డి,త‌హసిల్దార్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY