హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు

అన్యమతస్థులను అనుమతించరుఅమరావతి: ముఖ్యమంత్రి y.s.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇక నుండి  హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.అన్యమతస్థులను అనుమతించరు.ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా అన్యమతస్తులు ఆయా దేవాలయాల పరిధిలో పనిచేస్తుంటే వారిని వేరే శాఖల్లోకి మార్పుచేయాలని ప్రభుత్వం తన జీవోలో ఆదేశించింది.అన్యమతస్తులైన ఉద్యోగుల ఇళ్లలో జరిగే పండుగలు,పెళ్లిల్లు,ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్‌ శాఖకు లేదా దేవాదాయ శాఖకు అందజేస్తే వాటికి సంబంధించిన నిజనిర్ధారణ కోసం అధికారులు ఆకస్మిక తనిఖీలు జరుపుతారు.వారికి వచ్చిన సమాచారం నిజమైనదని రుజువైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.