ప‌గ‌టి పూట కుట్టే *ఆడెస్* అనే దోమలు వల్ల జికా వైరస్

0
189

అమ‌రావ‌తిః ప‌గ‌టి పూట కుట్టే *ఆడెస్* అనే దోమలు వల్ల జికా వైరస్ వ్యాప్తితో పాటు వ్యాధులు కూడా వ్యాపిస్తాయని,ఈ వైరస్ వ్యాపిస్తే జ్వరం, దద్దుర్లు,కళ్లకలక,కండరాలు,కీళ్ల నొప్పులు,తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి కలిచరణ్ సరఫ్ తెలిపారు. రాజ‌స్దాన్‌లో120 మందిలో జికా వైరస్‌ను గుర్తించామని,వీరిలో 105 మంది చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.ప్రతి ఇంటికి వెళ్లి జికా వైరస్‌కు సంబంధించిన అవగాహన కలిస్తున్నామని, వైరస్ సోకిన వారు తగిన చర్యలు తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే ఉపశమనం పొందొచ్చని అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.సంబంధిత ల‌క్షాలు క‌న్పించ‌న‌ప్ప‌డు తగిన విశ్రాంతి,బాగా నీళ్లు తాగడంతో పాటు పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారని సరఫ్ వెల్లడించారు. గర్భంతో ఉన్న మహిళలకు జికా వైరస్ వ్యాపిస్తే పిల్లలు కొన్ని లోపాలతో జన్మించే అవకాశాలు ఉంటాయని,అలాగే గర్భిణీల్లో పలు సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని,ఒక్కోసారి ముందే ప్రసవం కూడా జరిగే అవకాశాలుంటాయ తెలిపారు.

LEAVE A REPLY