మ‌నకి అన్నం పెట్టే రైతు గుళ్లో ప్రాసాదాలు తిని బ‌తుకుతున్నారు-జ‌న‌సేనాని

0
118

విశాఖ‌ప‌ట్నంః ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌లు ప్రాజెక్టులు పేరుతో వేల ఎక‌రాల భూములు సేక‌రిస్తు రైతుల‌కు క‌నీస ప‌రిహారం,పున‌ర‌వాసం ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం ఆన్యాయం చేస్తుంద‌ని జ‌న‌సేన అధ్య‌క్ష‌డు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆరోపించారు.శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ భూనిర్వసుతుల జ‌న‌స‌భ నిర్వ‌హించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ భూముల సేక‌ర‌ణ ప‌రిశ్ర‌మ‌ల కోసం అంటారు,వాటిని ఏర్పాటు చేయ‌రు,ఉద్యోగాలురావు,రైతుల్ని వ్య‌వ‌సాయం చేసుకోనియ‌రు ఇదే దారుణ‌మని ప్ర‌శ్నించారు.ఒక్కొ ప్రాజెక్టుకు విడివిడిగా పోరాటం చేయ‌డం కాకుండా అన్ని ప్రాజెక్టుల‌వాళ్ల ఒకే వేదిక మీదికి రావాల‌ని పిలుపునిచ్చారు.ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎస్‌.ఇ.జ‌డ్‌ల పేరుతో భూములు కోల్పియిన రైతులు అన్న మాట‌ల ఆలోచింప‌చేశాయని,ఇంత‌కు ముందు ఉళ్లో రోడ్లు వేసేవారు,ఇప్పుడు రోడ్డు కోసం ఉళ్లు తీసేస్తున్న‌ర‌ని రైతు ఆవేధ‌న వ్య‌క్తం చేశార‌న్నారు.40 సం..క్రింద‌ట స్టీల్ ప్లాంట్ కోసం 25 వేల ఎక‌రాలు తీసుకొని ఈ రోజుకి ప‌రిహారం,ఉపాధి క‌ల్పించ‌లేదు.ఆ భూమిలో ఇప్ప‌టికి స‌గమే వినియోగించారు.ఆ రైతులు అక్క‌డే కూలీలుగా మారారు.ఇంకొంద‌రు రైతులు బ‌క్క చిక్కి క‌డ‌పు ఆర్చుకుపోయి ఉన్నారు.గుళ్లో ప్రాసాదాలు తిని బ‌తుకుతున్నారు.మ‌నకి అన్నం పెట్టే రైతు క‌న్నీరు పెడుతున్నాడు.వై.ఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి హ‌యంలో వాన్‌పిక్ భూముల‌పై అప్ప‌డు టిడిపి పోరాడింది,అధికారంలోకి వచ్చాక ఏమి చేయ‌లేదు.ఈస‌మావేశానికి హాజ‌రైన ప‌లు ప్రాంత రైతులు వారు బాధ‌ల్పి తెలియ‌చేశారు.రాజ‌ధాని పేరుతో భూ స‌మీక‌ర‌ణ‌కి స‌హ‌కించని రైతుల‌తో ప్ర‌భుత్వ క‌క్ష సాదిస్తుంసోంద‌ని వాపోయారు.న‌లుగురు క‌ల‌సి మాట్లాడుకోనీయ‌డం లేద‌ని,ఎక్క‌డైన రైతులు క‌ల‌సి మీటింగ్‌లు పెట్టుకుంటే,పోలీసుల్ని పంపి బెదిరిస్తున్న‌ర‌ని చెప్పారు. ఈస‌మావేశంలో పాల్గొన్న ప్రొఫెస‌ర్ కె.వి ర‌మ‌ణ మాట్ల‌డుతూ భూములు సేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం విచ‌క్ష‌ణ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు.రైతుల నుండి సేక‌రించిన భూముల‌కు వేల రూపాయులు చేతిలో పెడుతుంద‌న్నారు.ప్రోఫెస‌ర్ చ‌లం మాట్లాడుతూ డి.పి.ఆర్ ఇవ్వ‌కుండా భూ సేక‌ర‌ణ‌లు చేస్తున్నారు.అనుమోలు గాంధీ మాట్లాడుతూ భూ సేక‌ర‌ణ‌కి ఒప్పకోని రైతుల‌ను చిత్ర‌హింస‌లు పెడుతున్నార‌న్నారు.

LEAVE A REPLY