విలాసాలకు దూరంగా హంపి మఠంలో విడిది చేసిన జ‌న‌సేనాని

0
130

తిరుపతిః జనసేనాని పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి నేరుగా రేణిగుంట వ‌చ్చారు.ప‌వ‌న్ వ‌చ్చిన విష‌యం తెలుసుకున్న అభిమానులు విమాన‌శ్ర‌యంకు చేరుకుని సిఎం సిఎం అంటు నినాద‌లు చేస్తుడ‌డంతో,వారిని జ‌న‌సేనాని వారించారు.విమాన‌శ్ర‌యం నుండి అలిపిరికి వ‌చ్చి అక్కడి నుంచి నడకదారిలో అభిమానులతో కలిసి కొండపైకి చేరుకుని, విలాసాలకు దూరంగా హంపి మఠంలో విడిది చేశారు.భక్తులకు ఇబ్బంది కాకుండా వీఐపీ దర్శనం కాకుండా ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.తిరుమలలో ఉండే మూడు రోజుల్లో ఇక్కడ ఉన్నతీర్థాలు,ఇతర దేవాలయాలను దర్శించుకోవడంతో పాటు భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి పవన్ స్వయంగా తెలుసుకుంటారని పార్టీ నేతలు వెల్లడించారు.తన రాకతో తిరుమలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పవన్‌ తన తిరుపతి పర్యటన గురించి ప్రకటన చేయలేదని తెలుస్తోంది.మరోవైపు,బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి జరిగిన నేపథ్యంలో పవన్‌‌కు భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించారు.తన రాష్ట్ర పర్యటనను ఎక్క‌డ నుండి ప్రారంభించనున్నారనేది సోమ‌వారం లేదా మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించి వేంట‌నే యాత్ర ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY