ఇంత మంది త‌న‌పై పెట్ట‌కున్న విశ్వ‌సం ప్రాణాలు పోయిన పొగోట్టుకోను-జ‌న‌సేనాని

0
140

ప్ర‌కాశంః దేశంలో జాతీయ‌పార్టీలే మ‌నుగ‌డ సాగిస్తాయ‌ని, కాబ‌ట్టి జనసేన పార్టీని వదిలి భాజపాలో చేరాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అడిగారని,నేను అలా చేసేవాణ్ని అయితే జ‌న‌సేన పార్టీ పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని, మర్యాదపూర్వకంగా చెప్ప‌న‌ని జ‌న‌సేనాని తెలిపారు.శ‌నివారం ఒంగోలులోని ఏ1 ఫంక్షన్‌ హాల్‌లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను ఒక్కడినే బయల్దేరానని, మార్పు ఒక్కడితోనే మొదలవుతుందని అన్నారు. ఇంటర్‌ చదువుతున్నప్పుడే రాజకీయాల్లో రావాలనుకున్నా. క్రమశిక్షణ, జవాబుదారీతనం, బాధ్యతతోనే రాజకీయాల్లోకి వస్తున్నన‌ని,రాజకీయాలంటే ప్రజల్లో భయం పోవాలి, భావితరాల భవిష్యత్‌ బాగుండాలనే ఈ నిర్ణయానికి వచ్చాన‌ని పవన్‌ పేర్కొన్నారు.సమావేశం మధ్యలో పవన్‌ను ఉద్దేశించి కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన పవన్‌.. మీరు సీఎం అంటే నేను అవను, మీ నినాద‌ల‌కు పొంగిపోను. సీఎం కావడానికి చాలా అనుభవం కావాలి, అన్ని కులాల మధ్య సామరస్యం కావాలన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడటం పెద్దకష్టం కాదని, నేను ఒక్కడినే పోరాడితే ప్రత్యేక హోదా రాదు. అందరూ కలిసి అడుగులు వేస్తేనే హోదాను సాధించుకోవచ్చాన్నారు. త‌న బ‌లం ధైర్యం అభిమానులేన‌ని, డ‌బ్బు కీర్తి పొగొట్టుకున్న ఫ‌ర్వ‌లేద‌ని,ఇంత మంది త‌న‌పై పెట్ట‌కున్న విశ్వ‌సం ప్రాణాలు పోయిన పొగోట్టుకోన‌నని ఉద్వేగం చెప్పారు.నాయకులు చాలామంది ఏం కావాలని అడిగారు, మంచిపాలన కావాలని స‌మాధానం ఇచ్చాన్న‌న్నారు.అవకాశవాద రాజకీయాలకు పాల్పడితే,ప్ర‌జ‌ల్లో ఆస‌హ‌నం మొద‌లై రాబోయే రోజుల్లో ఉద్యమాలు వస్తాయని పవన్ హెచ్చ‌రించారు.సమాజం బాగుపడాలి అనే కలతోనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

LEAVE A REPLY