ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎన్ని దెబ్బలు తినేందుకైనా సిద్దం-జ‌న‌సేనాని

0
172

అనంతపురంః పవన్ క‌ళ్యాణ్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంతో ఏపీలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని చాలామంది వ్యాఖ్య‌నిస్తున్న‌ర‌ని, యువత తలుచుకుంటే మార్పు తప్పక వస్తుందని జనసేనాని అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లాలో ఆయన యాత్ర రెండో రోజు కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆయన కదిరి చౌరస్తాలో అభిమానులను, కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వారికే 2019లో తన మద్దతు ఉంటుందని చెప్పారు.తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని, ఓ మాట ఇచ్చానంటే దానిని అమలు చేస్తానని అన్నారు.అనంతపురం జిల్లాను దత్తత తీసుకున్నానని, తరుచూ ఇక్కడకు వస్తానని, రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.మహిళలు, రైతులతో మాట్లాడుతూ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ? ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన‌ మహిళలకు ఏ మేరకు పింఛన్ ఇవ్వాలనే విషయం ఆలోచించాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభం గురించి కూడా మాట్లాడాల్సి ఉందని, తాను ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అండగా ఉంటానని చెప్పారు. నేను ఒకటి రెండు ఎన్నికల తర్వాత వెళ్లిపోయే వ్యక్తిని కాదన్నారు. ఏ సమస్య అయినా సినిమాలో లాగ‌ రెండున్నర గంటల్లో పరిష్కారమయ్యేది కాదని అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞాప్తి చేశారు.
తనకు నిజంగా డబ్బు సంపాదించుకోవాలని ఉంటే సినిమాలు ఉన్నాయని, రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదని,, ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే తాను ఎన్ని దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధమని,అది కూడా తనకు ఇష్టమే అన్నారు. తాను ఏ పార్టీని స‌మ‌ర్దించ‌డం లేద‌ని సమ‌స్య‌ల ప‌రిష్క‌ర‌మే తాన అంతిమ ల‌క్ష్యంమ‌న్నారు.

LEAVE A REPLY