పరకాల ప్రభాకర్‌పై నిప్పులు చెరిగిన జ‌న‌సేనాని

0
190

అమ‌రావ‌తిః గురువారం జ‌న‌సేనాని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టును రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని,ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అనంతరం ఆయన రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలతో స‌మావేశం అయ్యారు.ఈ సంద‌ర్బంలో అయ‌న ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌పై నిప్పులు చెరిగారు.పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్‌లు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చిరంజీవి నోరు లేని వ్యక్తి కాబట్టే పరకాల తిట్టేసి వెళ్లిపోయారని,ఆ సమయంలో తాను ఉండి ఉంటే సందర్భం మరోలా ఉండేదని,పరకాల వంటి నిబద్దత లేని వ్యక్తులు జనసేనకు అవసరం లేదన్నారు.
ప్రజారాజ్యం పార్టీపై విషం చిమ్మిన‌ ప్రభాకర్ ఇప్పుడు మాట్లాడటం లేదేమిటని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా దాని గురించి మాట్లాడని పరకాల, తన భార్య‌ను మాత్రం కేంద్ర కేబినెట్లో కూర్చోబెట్టారని విమ‌ర్శించారు. ప్రజారాజ్యంలో నిస్వార్థపరులు లేక నష్టపోయిందని, లేదంటే అప్పుడే చిరంజీవి సీఎంగా ఉండేవారన్నారు.తాను విధివిధానాలు లేకుండా ఆవేశంతో లేదా ఆకతాయితనంతో తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, కానీ రాజకీయంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పారు.తనకు వందల కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్లు లేరని, ఉన్నా తాను తీసుకోవనని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన వృత్తి సినిమాలు అని, ప్రవృత్తి రాజకీయం చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా అద్భుతాలు చేయవచ్చున్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు తాను చాలా చిన్నవాడినని, తన కంటే అనుభవజ్ఞులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ముఖ్య‌మంత్రి అయితే ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తాన‌ని అన‌డం స‌బ‌బుకాద‌న్నారు. ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో అధికార పార్టీకి ఊపిరిఆడకుండా చేయవచ్చున్నారు.డ‌బ్బులు లేకుండా రాజ‌కీయాలు చేయ‌వ‌చ్చ‌ని,తాను నిరూపిస్తానన్నారు.

LEAVE A REPLY