జ‌న‌సేనానిపై ముప్పేట‌దాడి-ప‌వ‌న్ ఎదురుదాడికి సిద్ద‌ప‌డుతున్నాడా?

0
72

అమరావతిః 2019 త‌రువాత కూడా త‌మ పార్టీనే అధికారంలో వుంటుంద‌న్న విశ్వాసంతో ధీమాగా వున్న తెలుగుదేశం పార్టీకి, ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణదీక్షకైనా సిద్దమని ప్రకటించడంతోపాటు టిడిపి అధినేత అయ‌న కుమారుడిపై పవన్ కల్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో టిడిపి వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది.జ‌న‌సేనా ఆవిర్బ‌స‌భ‌కు మీడియా క‌వ‌రేజ్ ఎక్క‌వ‌గా వుండ‌డంతో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయాయి.రాజ‌కీయాల్లో ఎన్నో అటుపోట్లు తిన్న చంద్ర‌బాబు తేరుకుని,వెంట‌నే అదే రోజు కౌంట‌ర్ ఇచ్చాడు.అయితే ఇంత‌టితో అగిపోతే చంద్ర‌బాబు చాణుక్య‌నీతి ఏముంటుంది.చ‌క చ‌కా పావులను క‌ద‌ప‌డం ప్రారంభించారు.టిడిపికి నూటికి నూరు శాతం కొమ్ము కాసే అదే స‌మాజిక వ‌ర్గంకు చెందిన ఛానల్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేష‌న‌ల్ మీడియాకు ఇంగ్లీష్,హిందిలో ఇచ్చిన ఇంట‌ర్వూల్లో ఒక ప‌దానికి మ‌రో ప‌ర్యాప‌దం జోడించి దుష్ప‌చారం విసృత్తంగా వ్యాప్తి చేయాడానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు.జ‌న‌సేనాని మాట‌ల‌ను వ‌క్రీక‌రిస్తు ఛాన‌ల్స్ ప్ర‌చారం చూసిన వెంట‌నే జ‌న‌సేనా కార్యాల‌యం ట్విట‌ర్‌లో ఖండ‌న వుంచింది.బుర‌ద చ‌ల్ల‌డ‌మే ధ్యేయంగా పెట్టుకున్న ఒక సామాజిక వ‌ర్గంకు చెందిన ఛాన‌ల్స్,జ‌న‌సేనా పార్టీ ఇచ్చిన ఖండ‌నకు పెద్ద ప్రాధ‌న్యం ఇవ్వాకుండా ప్ర‌త్యేక హోదాపై ప‌వ‌న్ మాట మార్చేడు అంటు భేటిలు న‌డిపారు.ఇదే స‌మ‌యంలో బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు హ‌రిబాబు,నేరుగా కాకుండా తొడ గిల్లి జోలాపాడిన చంద‌నా,,ప‌వ‌న్ అడిగినది న్యాయంగా వుంద‌ని,అయ‌న కోరిన విధంగా నిధులు స‌మ‌కూర్చేందుకు కేంద్రం సిద్దంగా వుంద‌ని కేవ‌లం ఒక ఛాన‌ల్‌కు వాయిస్ ఇచ్చిన త‌న వంతు స‌హాయం చేశారు.జ‌న‌సేనానిపై ఆదే సామాజిక వ‌ర్గంకు చెందిన మంత్రుల చేత మాట‌ల‌తో ప్రెస్‌మీట్ పెట్టి మ‌రి టిడిపి అధినేత మంగ‌ళ‌వారం దాడి చేయించారు. ఒక వేళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్రం ప్యాకేజ్ ఇస్తే చాలు అనుకుంటే ఫ్యాక్ట్ ఫైడింగ్ క‌మిటీ వేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అనే చిన్ని విష‌యంను అధికార‌పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు గుర్తుకు రానివ్వ‌కుండా అయ‌న‌ను మాన‌సికంగా దెబ్బ‌తియ‌డానికి టిడిపితో పాటు వై.ఎస్.ఆర్‌.సి.పి కూడా పావులు క‌దుపుతున్న‌ట్లు ప‌రిస్దితుల‌ను చూస్తే ఆర్దం అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.ప్ర‌జ బ‌లంతో అవినితికి పాల్ప‌ప‌డుతున్న‌వారిపై యుద్దం ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని మరింత అప్ర‌మ‌త్తంగా వుండాల్సి వుంది.ఎందుకంటే ఒకే అబద్దానికి 100 సార్లు 100 మంది చేత చెప్పిస్తే,ప్ర‌జ‌లు సందిగ్దంలో ప‌డే ఆవ‌కాశం వుంటుంది.ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఈ నయా ట్రెండ్ న‌డుస్తుంది.రాష్ట్రనికి రెండు పాచిపోయిన ల‌డ్లు ఇచ్చ‌రంటు జ‌న‌సేనాని కేంద్రం వైఖ‌రిని తీవ్రంగ ఖండించిన త‌రువాతే,రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక హోదా దానివ‌లన వచ్చే లాభ‌ల‌పై ఆవ‌గాహ‌న పెరిగింద‌న్న సంగ‌తి ఏవ‌రు అవును అన్న ఏవ‌రు కాద‌న్న నిజం నిజమే..రాబోయో రోజుల్లో టిడిపి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌ల‌కు తెర‌తీయ్యవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.ఇలాంటి రాజకీయా దాడుల‌ను జ‌న‌సేనాని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే…

LEAVE A REPLY