యువ‌త‌,ప్ర‌జ‌ల అండ‌తో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

0
93

విశాఖ‌ప‌ట్నంః 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు.విశాఖపట్నంలోని పెందుర్తిలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అధికార‌,ప్ర‌తిప‌క్ష నాయ‌కులు జనసేనకి బలం ఎక్కడుందని కొంత మంది ప్రశ్నించారని,ఇంత మంది ఇక్కడకు వచ్చారంటే ? ఇది మన బలం కాకపోతే మరేంటో చెప్పండి అంటు జ‌న‌సేన‌పార్టీపై వ్యాఖ్య‌లు చేస్తున్న‌వారిని సూటిగా ప్ర‌శ్నించారు. మొదట కొందరు జనసేన ఐదు సీట్లు గెలుచుకుంటుందన్నారు. యాత్ర‌ప్రారంభంమైన త‌రువాత జనసేనకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తాయని,మళ్లీ ఇటీవల జనసేనకి 10 % ఓట్లు వస్తాయని అంటున్నారని,ప్ర‌ధాని మోదీ కూడా 10 % ఓట్లతోనే రాజ‌కీయ ప్రాస్దానం ప్రారంభించారన్నారు.అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పది శాతం ఓట్లతోనే ప్రారంభంమైయ్యార‌ని,, 10 % తో ప్రారంభించిన వారు ఒకరు భారత ప్రధాని,మ‌రోకరు అమెరికా అధ్యక్షుడయ్యాడ‌న్నారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నారని,వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలన్నారు.యువ‌త కోసం పెందుర్తిలో కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా పెట్టలేకపోయారని చెప్పారు.ఒక్క ప‌క్క రైతుల భూములను దోపిడీ చేస్తుంటే,ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు వాటిని అడ్డుకోవాల్సింది పోయి భూ కబ్జాదారులకు అండగా ఉన్నారని ఆరోపించారు.పోనీ వైసీపీ నాయకులు అండగా ఉంటారా అంటే తమ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయండని, ప్రజల సమస్యలు తీరుస్తామని అంటున్నారని ఇదేక్క‌డి చోద్యంమ‌న్నారు.
సి.ఎస్‌.రావును ప‌రమ‌ర్శః– ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఐ.ఇ.ఎస్ ఆధికారి సి.ఎస్‌.రావు(90)ను బుధ‌వారం జ‌న‌సేనాని ప‌ర‌మ‌ర్శించారు.ఉద్యోగ విరమ‌ణ త‌రువాత వైజగ్ నివాస‌ముంటు,ప్ర‌భుత్వానికి సంబంధించిన ఎంతో విలువైన పాత జైలు భూముల‌ను ర‌క్షించాడ‌ని,అయ‌న ర‌క్షించిన భూముల్లోనే నేడు వైజ‌గ్ సెంట్ర‌ల్ పార్క్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

LEAVE A REPLY