అత్యాచారానికి ఒడిగట్టే మానవ మృగాలను బహిరంగంగా శిక్షించాలని-పవన్

0
74

అమ‌రావ‌తిః నిర్మల్ జిల్లాలో జరిగిన పదేళ్ల బాలిక అత్యాచారం, హత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం స్పందిస్తు,బాలిక అత్యాచారం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు.బాధితురాలి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని,బాలికలు,యువతులపై అత్యాచారానికి ఒడిగట్టే మానవ మృగాలను బహిరంగంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు.ఫోక్సో చట్టం అమలులో లోపాలు లేకుండా చూడాలని,ఇలాంటి ఘాతుకానికి పాల్పడే వారికి బహిరంగంగా శిక్ష వేస్తేనే నిందితుల్లో భయం పుడుతుందన్నారు.అన్నెంపున్నెం ఎరుగని బాలికలు,యువతులపై అత్యాచారానికి పాల్పడే మృగాలను శిక్షించాలన్నారు.నిర్మల్ జిల్లా సోన్‌లో పదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడనే విషయం తెలియగానే హృదయం ధ్రవించిందన్నారు.కాశ్మీర్‌లోని కథువా,గుంటూరు జిల్లా దాచేపల్లి ప్రాంతాలలో బాలికలపై చోటు చేసుకున్న అత్యాచార ఘటనల చేదు జ్ఞాపకాలు సమాజంలో పచ్చిగానే ఉన్నాయని,ఇప్పుడు సోన్‌లో చోటు చేసుకున్న దురాగతం బాధ కలిగించిందన్నారు. బహిరంగ శిక్ష ఉంటేనే పశువాంఛ కలిగిన వారిలో భయం పుడుతుందన్నారు.

LEAVE A REPLY