రైతు కష్టాలు,యువత ఆశయాలు,ఆడపడచుల బాధలూ తెలుసు-జ‌న‌సేనాని

0
73

అనంత‌ర‌పురంః సమస్యలపై తాను నిరంతర పోరాటం చేస్తానని, రాయలసీమ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ రోజు అనంతపురంలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ… రాయలసీమకు ఏ విధంగా మేలు చేస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని అన్నారు. త‌న‌పై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా జైలులో పెట్టినా భయపడనని చెప్పారు.సినిమాల్లో రాకముందు నేను రైతును.. రైతు కష్టాలు నాకు తెలుసు. యువత ఆశయాలు తెలుసు.. ఆడపడచుల బాధలూ తెలుసు. మీ ఇంట్లో ఒక సభ్యుడిగా ఇక్కడకు వచ్చ‌న‌ని,మీరు నాకు అండగా నిలిస్తే చాలు నా శక్తి మేరకు కృషి చేస్తా. త్రికరణశుద్ధిగా రాయలసీమ నేల కోసం పనిచేస్తా. ఆంధ్రప్రదేశ్‌కు నేను అండగా ఉంటానని మీరు భావిస్తే బలంగా ఓటు వేయండి. మీరు ఓటు వేసినా.. వేయకపోయినా నా పోరాటం కొనసాగిస్తా అన్నారు. రైతులు కన్నీరు పెట్టని అనంతపురాన్ని చూడాలనే ఉద్దేశంతోనే ఇటువంటి సదస్సులు పెడుతున్నాన‌ని తెలిపారు. తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, ప్రజలంతా కలిసి ఐక్యంగా కృషి చేస్తే రాయలసీమను అభివృద్ధి చేయవచ్చని అన్నారు. అడ్డంకులను అధిగమించి ఎదగడమే జీవితమని హిత‌వు ప‌లికారు.

LEAVE A REPLY