ఈ నెల 20న‌ ఉధ్యమాలకు పుట్టినిల్లు నుండి యాత్ర ప్రారంభం-జ‌న‌సేనాని

0
21

విశాఖ‌ప‌ట్నంః ఉధ్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళంజిల్లా ఇచ్ఛాపురం నుండి ఈ నెల 20వ తేదీన తన బస్సు యాత్ర ప్రారంభమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.గురువారం అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశ‌లో అయ‌న మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉరుకునేది లేద‌ని శ్రీకాకుళం నుంచే పోరాటంను ప్రారంభిస్తానని చెప్పారు.ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయని పరోక్షంగా టీడీపీ ప్రభుత్వాన్నిహెచ్చరించారు.జనసేన మేనిఫెస్టో టీం కూడా బస్సు యాత్రలో పాల్గొంటుందని, కొంతమంది పాలకుల నిర్లక్ష్యానికి కోట్లాది మంది ప్రజలు బలవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఉత్తరాంధ్రలో దాదాపు 45 రోజుల పాటు బస్సు యాత్ర సాగుతుందని,ప్రత్యేక హోదాపై 175 అసెంబ్లీ నియోకవర్గాల్లో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయ‌న్నారు. అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తు తన యాత్రలో సమస్యల పరిశీలనతో పాటు పరిష్కారం పైన కూడా దృష్టి సారిస్తానని చెప్పారు.2019 ఎన్నికలే తమ లక్ష్యమని,తమ ప్రభుత్వం వస్తే అన్ని జిల్లాల్లో అమరుల స్మారక చిహ్నాలు నెల‌కొల్ప‌త‌మన్నారు.

LEAVE A REPLY