6 ఏళ్ల చిన్నారి రేవతి పరిస్థితి చూసి చలించిపోయిన‌-జ‌న‌సేనాని

0
82

విశాఖ‌ప‌ట్నః మస్క్యులర్ డిస్ట్రఫీతో బాధపడుతున్న 6 ఏళ్ల చిన్నారి రేవతి పరిస్థితి చూసి జ‌న‌సేనాని చలించిపోయారు.ఆ చిన్నారికి అవసరమైన బ్యాటరీ వీల్ ఛైర్ సమకూర్చడంతో పాటు వైద్యం కోసం మైసూరుకు వెళ్ళేందుకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.శ‌నివారం విశాఖపట్నంలో ఆ కుటుంబం పవన్ కల్యాణ్‌ని కలిసింది.పాప‌ త్వరగా కోలుకోవాలని పవన్ కోరుకున్నారు.ఆరేళ్ళ ఆ చిన్నారికి కాళ్ళు, చేతులు పట్టు ఇవ్వకపోవడంతో ఇబ్బందిపడింది. రేవతిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ పాప ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులను అడిగి పవన్ తెలుసుకున్నారు. రేవతిని బెంగళూరులోని నిమ్ హన్స్ ఆసుపత్రిలో చూపించామని,పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు వైద్యం ఉందనీ, ఖర్చు చాలా అవుతుందని వైద్యులు చెప్పారని పవన్ కు రేవతి తల్లిదండ్రులు చెప్పారు. ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయించాల్సి వస్తోందని, ఒకవేళ చేయించకపోతే కండరాలు బిగుసుకుపోయి చాలా బాధపడుతోందని ఆమె తల్లి చెప్పిన మాటలకు పవన్ కల్యాణ్ కళ్లు చెమర్చాయి.
విజయవాడలో పౌరోహిత్యం చేసుకొంటూ చాలీచాలని సంపాదనతో సత్తిరాజు విజయకృష్ణ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.ఆ పేద పురోహితుని చిన్న కుమార్తె రేవతి పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన మస్క్యులర్ డిస్ట్రఫీ అనే వ్యాధితో బాధపడుతోంది.కాళ్ళు, చేతులు బిగుసుకుపోవడం,మెడ నిలబెట్టలేకపోవడం లాంటి సమస్యలతో రేవతి ఇబ్బందిపడుతోంది. తగిన వైద్యం చేయించకపోతే ఒక్కో అవయవం క్షీణించిపోయే ప్రమాదం ఉంది. మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంవారు వైద్యం చేయిస్తామన్న‌రని,చికిత్స పూర్తయ్యే వరకూ కుటుంబం మైసూరులోనే ఉండాలి.విజయవాడ నుంచి మైసూర్ వెళ్ళేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ని ఆ చిన్నారి తల్లిదండ్రులు లక్ష్మీసుమ, విజయకృష్ణ, అక్క జయలక్ష్మి కలిశారు.

LEAVE A REPLY