రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఇసుక దోపిడీ,భూ కబ్జాలే-జ‌న‌సేనాని

0
105

శ్రీకాకుళంః ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారని జ‌న‌సేనా అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆరోపించారు.ఆముదాలవలసలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలు,జనసైనికులు రోడ్లపైకి వస్తున్నారంటే చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమని,శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ,భూ కబ్జాలే కనిపిస్తున్నాయని,భవిష్యత్తులో ఇసుక మ్యూజియం వస్తుందంటూ ఎద్దేవ చేశారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్కడ భూమి కంపించినా టీడీపీ నేతలు లాగేసుకుంటున్నారని,భూమిని,మట్టిని దోచుకునేవారు మట్టిలో కలిసిపోతార‌న్నారు.ఏపీని టీడీపీ నాయకులు కబ్జా ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తీవ్రంగా విమ‌ర్శించారు.ఈ సందర్భంగా వంశధార ప్రాజెక్టు గురించి పవన్ మాట్లాడుతూ,ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండా అక్కడి ప్రజలను మెడపట్టి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు.వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మోసం చేయొద్దని,రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా అగ్రిగోల్డ్ బాధితులు కనిపిస్తున్నారని,బాధితులకు న్యాయం చేయ‌కుంటే,జ‌న‌సేన చూస్తు ఉరుకోద‌ని హెచ్చిరించారు.జ‌న‌సేన పార్టీకి పూర్తి మద్దతు వస్తే ఉద్యోగుల సీపీసీ స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యేలు,మంత్రి అచ్చెన్నాయుడు గురించి ప్రస్తావిస్తు,తమ పార్టీ కార్యకర్తలను వేధించవ‌ద్దని,దేనికైన ఒక హ‌ద్దు ఉంటుంద‌న్న సంగంతి గుర్తుంచుకోవాల‌ని హితవు పలికారు.

LEAVE A REPLY