ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్నిపారదోలే వరకు పోరాటం-జ‌న‌సేనాని

0
87

విశాఖ‌లో నూత‌న కార్య‌ల‌యం ప్రారంభం
విశాఖ‌ప‌ట్నంః ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్నిపారదోలే వరకు పోరాటం చేస్తామని,అన్ని వనరులు ఉన్న ఉత్తరాంధ్ర వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమ‌ని జ‌న‌సేన అధ్యక్ష‌డు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అన్నారు.విశాఖపట్నంలోని సీతమ్మధార టీపీటీ కాలనీలో జనసేన నూతన కార్యాలయం మంగళవారం ప్రారంభమైంది. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో దీనిని పవన్ ప్రారంభించారు.ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ వెనుకబాటుతనానికి కారణాలు అన్వేషఇంచడంతో పాటు ఇక్కడి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు సూచించి అభివృద్ధికి బాటలు వేసేందుకు మన కార్యాలయం వేదిక కావాలన్నారు.ఈకార్య‌క్ర‌మానికి ఉత్త‌రాంధ్ర‌నాయ‌కుల‌తో పాటు కార్య‌కర్త‌లు,అభిమానులు పాల్గొన్నారు.
జ‌న‌సేన‌లోకి నాయ‌కుల చేరిక‌లుః–ఉత్తరాంధ్రలో ఉన్న జనసేనాని పలువురు నేతలను కలుసుకోనున్నారని తెలుస్తోంది.పలువురు నాయకులు చేరగా,మరికొందరు చేరే అవకాశముందని స‌మాచారం.దింతో పార్టీ బలోపేతంపై కూడా పవన్ దృష్టి సారించారని,పర్యటనలో ఆయనను పలువురు కలుస్తున్నట్లు తెలుస్తుంది.గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌‌లో చేరి విశాఖ ఎంపీగా బరిలో దిగిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. పీసీసీ కార్యదర్శి గుంటూరు నర్సింహమూర్తి, ఆయన భార్య గుంటూరు భారతి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.వారి గ‌మ్యం కూడా జ‌న‌సేన కావ‌చ్చు !

LEAVE A REPLY