దీక్షలపై పెట్టే రూ.కోటి పాడేరు ఆసుపత్రికి ఇస్తే బాగుపడేది-జ‌న‌సేనాని

0
97

విశాఖ‌ప‌ట్నంః ముఖ్య‌మంత్రికి నేను పాడేరు నుంచి చెబుతున్నానని,మన్యంను అడ్డగోలుగా దోచేస్తున్నారు, ప్రభుత్వ ఖజానాకు పాడేరు నుంచి రావాల్సిన డబ్బులు రావ‌డంలేదని,ఇలా చేస్తే తెలంగాణలాగ‌,,కళింగాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కళింగాంధ్ర ఉద్యమం ప్రారంభమైతే మీతో సహా ఎవరికీ సుఖ సంతోషాలు ఉండవని అయ‌న‌ హెచ్చరించారు.గురువారం విశాఖ జిల్లా పాడేరు పర్యటించిన సంద‌ర్బంలో ముఖ్యమంత్రి నారా.చంద్రబాబునాయుడు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి పవన్ మాట్లాడుతుండగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పదేపదే సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేస్తున్న‌ప్ప‌టికి ఆయన తన ప్రసంగాన్నికొనసాగిస్తు,,,SPL DSC పై సీఎం చంద్రబాబు మూడేళ్లుగా చెబుతున్నారని, చేస్తున్నారా, మీరు అడగరా అని యువతను ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, కానీ వస్తున్నాయా అని అడిగారు. తాను ఇక్కడకు రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రి, వంద పడకల గురించి అన్నారు. ఇక్కడ వంద పడకలు ఉన్నాయని, కానీ అందుకు కావాల్సిన డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్సులు లేవన్నారు. సీఎంకు నేను పాడేరు నుంచి చెబుతున్నానని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అన్నారని, కానీ జబ్బుల ఏపీని చేశారన్నారు. దేశంలో ఎక్కువ మంది డాక్టర్ గ్రాడ్యుయేట్లు ఏపీ నుంచే ఉంటారని, కానీ ఇక్కడి ఆసుపత్రుల్లో ఉండరన్నారు. మొన్న నేను ఇక్కడ ఓ చిన్నారిని ఎత్తుకున్నానని, నా కొడుకు అంత వయస్సు ఉన్నదని, ఆమెను ఎత్తుకుంటే ఏదో విచిత్ర వ్యాధి ఉందని తేలిందన్నారు.ప్రత్యేక హోదాపై తాను మొదటి నుంచి మాట్లాడుతున్నానని పవన్ గుర్తు చేశారు.అప్పుడు నేను మాట్లాడితే అవసరం లేదని చెప్పారన్నారు.కానీ ఇప్పుడు అదే చంద్రబాబు ప్రత్యేక హోదా అంటూ దీక్షలు చేస్తున్నారు.ఆయన చిత్తశుద్ధి లేని దీక్షలపై రూ.కోటి ఖర్చు పెడుతున్నారన్నారు.ఇలా దీక్షలపై పెట్టే రూ.కోటి పాడేరు ఆసుపత్రికి ఇస్తే బాగుండేదన్నారు.రూ.కోట్లు ఇస్తే ఇక్కడ నీటి బాధలు తొలగుతాయన్నారు.పేపర్లోనే టీడీపీ ప్రభుత్వం బాగుందన్నారు. ప్రజల స‌మ‌స్య‌ల నుండి వచ్చే పాలసీలు బలంగా ఉంటాయని,అందుకే నేను ఇక్కడి నుంచి స‌మ‌స్య‌లు తీసుకొని పాలసీలు ఏర్పాటు చేసుకునేందుకు వచ్చానని, ఓట్లు అడిగేందుకు రాలేదన్నారు.

LEAVE A REPLY