మొక్క‌ల పెంపంక‌దార్ల‌ను రైతులుగా గుర్తించాలి-జ‌న‌సేనాని

0
129

అమ‌రావ‌తిః 5వేల ఎక‌రాల్లో న‌ర్స‌రీ పెంప‌కంమే వృత్తిగా దాదాపు ల‌క్ష మంది కార్మికులు జీవిస్తున్న‌ర‌ని,దేశం మొత్తానికిక ఇక్క‌డి నుండి మొక్క‌లు ఎగుమ‌తి చేస్తున్న‌ర‌ని, కడియం నర్సరీ పెంపకందారులను రైతులుగా గుర్తించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన నర్సరీ రైతులు కొందరు హైరదాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన్ని కలిసి వారి సమస్యలను వివరించారు.ఈస‌ద‌ర్బంలో అయ‌న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏ రైతు అయిన పంట పండించి అమ్ముకుంటాడ‌ని,అలా అని వారంద‌ర‌ని వ్యాపార‌స్తుల కింద భావిచడం స‌బ‌బు కాద‌న్నారు.గ‌తంలో ఎన్‌.టి.రామారావు ప్ర‌వేశ‌పెట్టిన 5ఏ జి.ఓను ఆమ‌లు చేయాల‌ని,క‌డియం ప్రాంతంలో హ‌ర్టీక‌ల్చ‌ర్ రిసెర్చ్ సెంట‌ర్‌ను స్దాపించి వారిని అందుకోవాలే తప్ప‌,వారి చేతుల‌ను న‌రికివేయండ భావ్యం కాద‌న్నారు.ఈ వేదిక నుండి రైతులు స్వ‌యంగా వారి స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం,ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని కోరారు.తూర్పు గోదావ‌రి క‌డియం మండ‌లం రామిరెడ్డి ప‌ల్లె నుండి వ‌చ్చిన రైతు ముద్ర‌గ‌డ్డ‌.జ‌మీయ్య,మ‌ల్లు.పోత‌రాజు,శ్రీనివాస‌రావు,త‌దిత‌రులుమాట్లాడారు. గ‌త 20 సంవ‌త్ప‌రాల నుండి విభిన్న మొక్కలను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకు వస్తున్న కడియం నర్సరీ పెంపకందారులను తక్షణం రైతులుగా గుర్తించాలని, వారికి ఉచిత విద్యుత్ అందించాలని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారికి *జనసేన* అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY