అమరావతి అభివృద్ధి తప్ప పాయకరావుపేట అభివృద్ధి అవసరం లేదా-ప‌వ‌న్‌

0
95

విశాఖ‌ప‌ట్నంః చంద్రబాబుకు అమరావతి అభివృద్ధి తప్ప పాయకరావుపేట అభివృద్ధి అవసరం లేదని పవన్ మండిపడ్డారు.2019 ఎన్నికల్లో పాయకరావుపేట సీటు జనసేనా గెలుచుకోవ‌డం ఖాయమని జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.శుక్రవారం పాయకరావుపేట బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.గురజాడ పుట్టిన గడ్డ పైన ప్రభుత్వ కాలేజీ లేకపోవడం దారుణం అన్నారు.అమరావతిలోయూనివర్సిటీలకు ధారాదత్తం చేశారని,కానీ పాయకరావుపేటలో ఒక్క డిగ్రీ కళాశాల ఇచ్చేందుకు మంత్రి గంటా.శ్రీనివాసరావు, మిగతా టీడీపీ నేతలు వెనుకాడుతున్నారన్నారని ఆరోపించారు.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ పాయకరావుపేటలో ఆసుపత్రిని అరవై పడకలకు మార్చకపోవడం మీ చేతగానితనానికి నిద‌ర్శ‌మ‌న్నారు.అంతకుముందు ఇటీవల ఫ్లెక్సీలు కడుతు చనిపోయిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పవన్ ప్రకటించారు. చనిపోయిన కార్యకర్తల పిల్లల చదువును పార్టీ చూసుకుంటుందని త‌క్ష‌ణ స‌హాయం క్రింద 3 ల‌క్ష‌ల రూపాయ‌లు అంద‌చేశారు.
ఎలమంచిలిః– ప్ర‌తి నియోజక వర్గాల్లోనూ పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు దోపిడీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.ఒక పార్టీ కి చెందిన నేతలు దోపిడీ చేస్తుంటే మరొక పార్టీ నేతలు నిలదీయరని,అందుకే మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలిలో కొనసాగిస్తోన్న జనపోరాట యాత్రలో పవన్‌ మాట్లాడుతూ 2019లో కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, జరుగుతోన్న మార్పులను చూస్తోంటే అలాగే కనబడుతోందని అన్నారు.గత ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా తాను టీడీపీకి మద్దతు తెలిపానని, తనకు ఏం చేస్తారని టీడీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ అడగలేదని,రాష్ట్ర యువతకి ఏం చేశార‌ని నిల‌దీస్తున‌న్నారు.నిరుద్యోగ భృతి కూడా అందరికీ కాదని,డిగ్రీలు చదువుకుని ఉండాలంటున్నారని,మరెన్నో నిబంధనలు పెట్టారన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే తాను సినిమాలు విడిచిపెట్టానని,జన్మభూమి కమిటీలు ప్రజల్ని మభ్యపెడుతూ దోపిడీ చేసే కమిటీలుగా ఉన్నాయని విమ‌ర్శించారు. బీజీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు రావాలంటే తెలుగు దేశం పార్టీ జెండాలు పట్టుకోవాలని నీచంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇటువంటి పనులు చేసే తెలంగాణలో టీడీపీని లేకుండా చేశారని ఎద్దేవాచేశారు.

LEAVE A REPLY