మ‌న ఉనికిని ప్రశ్నార్థకం చేసే అభివృద్ధి అవ‌స‌రం లేదు-జ‌న‌సేనాని

0
31

విశాఖ‌ప‌ట్నంః మ‌న ఆట‌,పాట‌,సంప్ర‌దాయాల‌కు గౌరవమిచ్చేఅభివృద్ధి ఉండాలి కానీ,మ‌న ఉనికిని ప్రశ్నార్థకం చేసే అభివృద్ధి అవ‌స‌రం లేద‌ని ప్రకృతికి దగ్గరగా జీవించేవారి మనసు,ఆలోచనల్లో స్వచ్ఛత ఉంటుందని,వారి జీవనంలో అవినీతికి తావు ఉండదని,ప్రకృతి,అడవులు ఇంకా మనకి మిగిలి ఉన్నాయంటే అందుకు కారణం గిరిజనులే అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.సోమ‌వారం విశాఖపట్నంలోని అరకులో పవన్.. గిరిజనులతో సమావేశమయ్యారు.ఆరుబయట ప్రకృతిలో వారితో మాట్లాడుతుండగా వర్షం మొదలైంది.ఆ సమావేశాన్ని రిసార్ట్ లో కొనసాగించారు. గిరిజ‌నుల స‌మ‌స్య‌లు, అత్య‌వ‌స‌రంగా క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు.నాయ‌కులు ఏదో సంపాధించుకోవాల‌ని అత్యాశతోనే అవినీతికి బీజం పడుతుందని, అభివృద్ధికి మైనింగ్ అవ‌స‌ర‌మే అయితే అది ఎక్క‌డ త‌వ్వాలి? ఎంతమేరకు అనేది నిబంధనలకి అనుగుణంగా ఉండాలని,అమ‌రావ‌తిలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఇంటికింద త‌వ్వినా ఏదో ఒక ఖ‌నిజం దొరుకుతుందన్నారు.ఇక్క‌డికి గిరిజ‌నుల‌ను రెచ్చ‌గొట్ట‌డానికో,మ‌భ్య‌పెట్ట‌డానికో,రాజకీయ అవసరాలకో రాలేదని,గిరిజ‌నుల‌ను భ‌య‌పెట్టి,“బ‌ల‌హీనులుగా చేసేవారిపై“ పోరాడ‌టానికి వచ్చాన‌ని,ఈ విషయంలో మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు.మీ నుంచి ఏమీ ఆశించను బాక్సైట్ మైనింగ్ విషయంలో ఎప్పుడూ గిరిజనులకే అండగా ఉంటానని,బాక్సైట్ త‌వ్వ‌కాల‌పై గ్రామ స‌భ‌లు పెట్టి, 70 శాతం ప్ర‌జ‌ల ఆమోదంతోనే త‌వ్వ‌కాలు జరపాలన్నారు.ప్ర‌కృతిలో మ‌మేకమై జీవించే గిరిజనుల్ని దాని నుంచి దూరం చేస్తే అశాంతికి దారి తీస్తుంది. కొద్దిమంది ఏసీ గ‌దుల్లో కూర్చొని గిరిజన పాల‌సీలు రాస్తున్నారు.వారు గిరిజన గూడేలు తిరిగి పాల‌సీ రాస్తే అది ఉప‌యోగ‌ప‌డుతుందన్నారు. మ‌త్స్య‌కారుల‌ను ఎస్టీల్లో చేరుస్తామ‌ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందని,దానిని నేను ప్ర‌శ్నిస్తే నాపై గిరిజనుల్ని రెచ్చగొట్టారని, నాలుగు ద‌శాబ్దాల చంద్ర‌బాబు అనుభ‌వం కులాల మ‌ధ్య కుమ్ములాట‌లు పెట్ట‌డానికి పనికొచ్చిందన్నారు.

LEAVE A REPLY