ఉత్త‌రాధ్ర‌ను నిర్ల‌ల‌క్ష్యంచేస్తే మ‌రో ఉద‌మ్యం త‌ప్ప‌దు-జ‌న‌సేనాని

0
114

విజ‌య‌న‌గ‌రంః అమరావతి, విజయవాడ, గుంటూరులోనే అభివృద్ధి చేస్తే మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమం మొదలుతుందని, ఇతర ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పట్టించుకోకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా మూడు ముక్కలవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.ఈరోజు విజయనగరం జిల్లా పార్వతీపురం,కురుపంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలా ఇక్కడ కళింగాంధ్ర ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉదని అన్నారు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన వస్తుందని పేర్కొన్నారు.అనంత‌రం బోబ్బ‌లిలో మాట్లాడుతూ తాండ్ర‌పాపారాయుడు తిరిగిన నేల పై అడుగుపెట‌టండం ఎంతో సంతోషంగా వుంద‌న్నారు.ప్ర‌త్యేక‌హోదా పై మొద‌టి నుండి ఒకే మాట‌పై నిల‌బ‌డిన పార్టీ ఒక్క జ‌న‌సేన మాత్ర‌మే అని గుర్తిచేశారు.2014 ఎన్నిక‌ల్లో ఏమి ఆశించ‌కుండా టిడిపి,బిజెపిల గెలుపు కోసం విజ‌య‌న‌గ‌రం వ‌చ్చాన్నారు. రాయ‌కీయ‌ల్లో కావాల్సింది ఒకే మాట‌పై నిల‌బ‌డే ద‌మ్మున్న నాయ‌కులు కావాల‌న్నారు.ప్ర‌కృతి సంపాద‌లు వున్న శ్రీకాకుళం,విజ‌య‌నగరాలను ప్ర‌భుత్వం ఎందుకు అభివృద్ది చేయ‌డంలేద‌ని నిల‌దీశారు.రైతుల స‌మ‌స్య‌ల‌పై నిల‌దీయ‌డంలో ఒక్క‌పార్టీకి కూడా చిత్త‌శుద్దిలేద‌ని,ప‌ద‌వులు పంచుకునేందుకే ముందుకు వ‌స్తారుకాని,స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిచ‌డంలో కాద‌ని ఇలాంటి వాటిని నిల‌తీసేందుకు జ‌న‌సేన ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చింద‌న్నారు.రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పరిశ్రమలు, ఉద్యోగాలు, సాగునీరు లేవని పవన్‌ అన్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో చేసిన తప్పే మళ్లీ ఇక్కడ చేస్తున్నారని,అభివృద్ధి ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతమయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్ధానం సమస్య జనసేన వల్లే బయటకు వచ్చిందని,నాలుగేళ్ల క్రితం పెట్టిన పార్టీ ఇంత చేయగలిగినప్పుడు ఇన్నేళ్లుగా ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయని ప్రశ్నించారు

LEAVE A REPLY