లోకేష్ మీఇంట్లో డ‌బ్బుతో రోడ్లు వేయించ‌లేదు-జ‌న‌సేనాని ప‌వ‌న్‌

0
45

టిడిపి నాయ‌కులు ఇసుక క‌న్పిస్తే తినేస్తున్నారు
శ్రీకాకుళంః జనసేనకు ఒక శాతం ఓట్లే వస్తాయా అని మాట్లాడిన చంద్ర‌బాబు,గత ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని మన పార్టీ ఆఫీస్‌కి వచ్చి మరీ మద్దతు అడిగారని,ఆయనది ఏరు దాటాకా తెప్ప తగలేసే రకం మీ మాటలు, కథలు వినేందుకు ఇక్కడ ఎవరూ పాత తరంవాళ్లు లేరంటు తెలుగుదేశంపార్టీ అధినేతను తీవ్రంగా క‌డిగిపారేశారు.మంగ‌ళ‌వారం శ్రీకాకుళం పట్టణంలో ప్రభుత్వాల తీరుపై నిరసన కవాతు నిర్వహించినంత‌రం ఏడు రోడ్ల జంక్షన్ లో పవన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈసంద‌ర్బంలో అయ‌న మ‌ట్లాడుతూ మంత్రి లోకేష్ మీఇంట్లో డ‌బ్బుతో రోడ్లు వేయించ‌లేద‌న్న సంగ‌తి గుర్తుంచుకోవ‌ల‌న్నారు.లక్ష కోట్ల రూపాయలతో అమరావతి అభివృద్ధి అంటారు గానీ ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం 200 కోట్ల రూపాయలయినా చంద్రబాబు ఇవ్వలేకపోతున్నారని జనసేన అధ్యక్షుడు త‌ప్ప‌ప‌ట్టారు.పుష్కరాలకు 2 వేల కోట్లు ఇచ్చే ప్రభుత్వం శ్రీకాకుళం రైతులకి ఉపయోగపడే ఇరిగేషన్ ప్రాజెక్టులకి నిధులు ఇవ్వడం లేదని ప్ర‌శ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో శ్రీకాకుళం జిల్లా అంటే చిన్న చూపు అని ఆరోపించారు. కాలుష్య కారక పరిశ్రమల్ని శ్రీకాకుళం స్దాపించి ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని విమ‌ర్శంచారు.ఈ పాలకులకి మన శ్రీకాకుళం అంటే చిన్న చూపు.ఇక్కడి ప్రజల సంక్షేమం,అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు.ఉత్తరాంధ్ర నాయకులం అని చెప్పుకొనే అచ్చెన్నాయుడు,అశోక గజపతి రాజు,బొత్స సత్యనారాయణలు ఉద్ధానం సమస్యని ఇన్నేళ్లుగా ఎందుకు పట్టించుకోలేద‌ని,రెండు దశాబ్దాల్లో 40 వేల మంది చనిపోయినా వీరిలో కదలిక రాదా? మరోవైపు భూగర్భ జలాల్ని కలుషితం చేసే పరిశ్రమల్ని ఇక్కడ పెట్టిస్తున్నారు.అంటే ప్రజలకి రక్షిత మంచి నీళ్లు కూడా దక్కనీయరా? అచ్చెన్నాయుడు డబ్బున్న వ్యక్తి కాబట్టి మినరల్ వాటర్ తాగుతారు. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? గుజరాత్ వాళ్లు వద్దంటే అణు విద్యుత్ కేంద్రాన్ని ఈ జిల్లాలోని కొవ్వాడలో పెట్టిస్తున్నారు. పచ్చని భూములు లాక్కొంటున్నారు. ఇలాంటి విద్యుత్ కేంద్రం వల్ల ఉపద్రవం వస్తే ఏమీ మిగలదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కవాతులు చేస్తున్నామ‌న్న‌రు .శ్రీకాకుళం జిల్లాలో ఏ మూలకి వెళ్లినా అధికార పార్టీవాళ్ల భూ కబ్జాలు,ఇసుక దోపిడీ గురించే మాట్లాడుతున్నారని.టీడీపీవాళ్లకి ఇసుక అంటే ఎంత ఇష్టమో! కనిపిస్తే చాలు కరకరా నమిలేస్తున్నారు.ఇసుక దోపిడీకి నదులు బావురుమంటున్నాయి.జ‌న‌సైనికులు అంటే చేతులు ముడుచుకుని కుర్చూనే ర‌కం కాద‌ని, ఇక్కడ ఉన్నది పోరాటం యువత అని గుర్తుపెట్టుకోండి అంటు హెచ్చ‌రించారు.

LEAVE A REPLY