నిరాహారదీక్షలంటే వాళ్లకు అంత వెటకారంగా ఉందో-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

0
33

విశాఖ‌ప‌ట్నంః ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే లక్ష్యంగా విశాఖపట్టణంలో జనసేన పార్టీ నిరసన కవాతు జరిగింది. స్థానిక ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి ఉడా పార్క్ వరకు కవాతు కొనసాగింది. నిర‌స‌న కవాతులో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని,అక్క‌డ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జ‌న‌సేనాని మాట్లాడుతూ,టీడీపీ నేతలు బరువు తగ్గడం కోసం నిరాహారదీక్షలు చేస్తారట ! నిరాహారదీక్షలంటే వాళ్లకు అంత వెటకారంగా ఉందో,అశోక్ గజపతి రాజు గురించి… ఓకే మీరు రాజులు,సంస్థానాధీశులు,పెద్దవాళ్లు..నేనేమీ కాదనను.. గౌరవిస్తాను.నేను సామాన్యుడిని.. ఓ చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకుని.నేను అశోక్ గజపతిరాజు గురించి ఒకమాట కూడా అనలేదు. కేవలం,స్పెషల్ స్టేటస్ గురించి మాత్రమే నేను అడిగితే.. వాడెవడో పవన్ కల్యాణ్.. యాక్టరా..వాడెవడో నాకు తెలియదు అని అశోక్ గజపతిరాజు మాట్లాడారు.అయినా,నాకేమీ ఇబ్బందిలేదు… నేను భరిస్తా.నేను ఉద్దానంలో నిరాహారదీక్ష చేస్తే.. రిసార్ట్ లో నిరాహారదీక్ష చేశానని అశోక్ గజపతిరాజు అన్నారు. అందరిముందు కూర్చుని నేను నిరాహారదీక్ష చేశా…రిసార్ట్ లో కాదు.అశోక్ గజపతిరాజుకు అది కనిపించకపోతే.. నేనేమీ చేసేది అంటు ప‌రోక్షంగా విమర్శించారు.ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని,వాటికి ప‌రిష్క‌ర మార్గాలు క‌నుగొనేంత వ‌ర‌కు యాత్ర కొన‌సాగుతుంద‌న్నారు.ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ లోకేశ్ ఢిల్లీకి సైకిల్ పై వెళ్లి నిరసన తెలపాలని అన్నారు. ‘విశాఖపట్టణానికి రైల్వేజోన్ కావాలంటే నలుగురు చాలు. చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్ కలిసి పోరాడితే రైల్వేజోన్ తప్పక వస్తుంది. రైల్వే శాఖ తనపై కేసులు పెట్టినా నేను నిలబడతా’ అని పవన్ అన్నారు.

LEAVE A REPLY