విజయవాడలోని పడమటలంకలో నూతన గృహప్రవేశం చేసిన జ‌న‌సేనాని

0
96

అమ‌రావ‌తిః జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. సొంత ఇల్లు పూర్తి కాకపోవడంతో విజయవాడలోని పడమటలంకలో శుక్రవారం నూతన గృహప్రవేశం చేశారు. అద్దెకు తీసుకున్న ఇంటిలో పవన్ కళ్యాణ్ సతీసమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.గురువారమే హైదరాబాద్ నుంచి కుటుంబసమేతంగా విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ నిరాడంబరంగా గృహ ప్రవేశం చేశారు.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు విజయవాడకు వచ్చినా హోటళ్లలోనే ఉంటున్నారు.గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ సమీపంలో తన సొంత ఇల్లు పూర్తయ్యే వరకు పవన్ ఈ ఇంట్లోనే ఉండనున్నారు.రామవరప్పాడు వద్ద ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా ఉంచాలని,కొత్తగా రాజధాని ప్రాంతంలో భూమిపూజ చేసిన రాష్ట్ర పార్టీ కార్యాలయం పనులు త్వరగా ప్రారంభింపజేయాలని పవన్ అనుకుంటున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికి అందుబాటులో ఉండేందుకే అద్దె ఇల్లు తీసుకున్నారని,పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ,ముఖ్య నేతలతో సమావేశాల నిర్వహణ పవన్ ఇక్కడ్నుంచే చేస్తారని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY