2019 ఎన్నిల్లో రాష్ట్రంలోని 175 నియోజ‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేస్తుంది-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

0
135

ఎన్‌.టి.ఆర్ స్దాపించిన పార్టీ చంద్ర‌బాబు న‌డుపుతున్న‌డు
శ్రీకాకుళంః జనసేన పార్టీకి ప్రజల సమస్యలే అజెండా అని, ప్రజాసమస్యలపై అవగాహన కోసమే యాత్ర ప్రారంభించాను తప్ప రాజకీయాల కోసం కాదని స్పష్టం చేస్తు,2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యనించారు.అదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించక ముందు కవిటి మండలంలోని కాపాసుకుద్దిలో అయ‌న‌ సముద్ర స్నానం చేసి,గంగమ్మకు ప్రత్యేకపూజలు నిర్వ‌హించారు.ఈ సందర్భంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మత్స్యకార మహిళలు ఘనస్వాగతం పలికారు.స్దానికుల‌తో సమావేశమైన‌ సందర్భంలో జ‌న‌సేనాని మాట్లాడుతూ, ఇతర రాజకీయపార్టీలతో తమ పార్టీని పోల్చిచూడ‌వద్దని,ఇతర పార్టీల నాయకులు పదవుల కోసం తపిస్తే,జ‌న‌సేన‌ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంద‌న్నారు.ఉద్ధానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని,తాము అధికారంలోకి వస్తే ఉద్ధానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని,మరో నాలుగు నెలల తర్వాత శ్రీకాకుళం జిల్లాకు మళ్లీ వస్తానని చెప్పారు.
నిర‌స‌న క‌వాతు స‌భః–ఇప్ప‌డున్న ప‌రిస్దితుల్లో రాజ‌కీయపార్టీని స్దాపించి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం క‌ష్టమ‌న్నారు.చంద్ర‌బాబు స్వ‌యంగా పార్టీని స్దాపించ‌లేద‌ని ఎన్‌.టి.ఆర్ స్దాపించిన పార్టీలో చేరి అందులో ఎదిగాడ‌న్నాడని,ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అలాంటి వెసుల‌బాటు లేద‌ని జ‌న‌సేనాని అన్నారు. స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగ సభలో పవన్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ ఉద్ద‌నం స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని కోరిన ప‌ట్టించుకోలేద‌ని,పుష్క‌రాల‌కు కోట్ల రూపాయ‌లు ఎలా ఖ‌ర్చుపెట్టార‌ని ప్ర‌శ్నించారు.అధికారం అనేది రెండు కుటుంబాల‌కు,రెండు పార్టీల‌కే కాద‌ని,అరోజులు పోయ్యాయ‌న్నారు.ప్ర‌జ స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెస్తున్న జ‌న‌సేనికులను అణ‌గ‌త్రొక్క‌ల‌ని చూస్తే,ఉవ్వేతున లేచి కెర‌టంలా తిర‌గ‌బ‌డుతామ‌న్నారు.ప్ర‌త్యేక‌హోదాపై తాను తిరుప‌తిలో మాట్లాడితే,రాత్రికి రాత్రే డిల్లీ నుండి ప్ర‌త్యేక‌ప్యాకేజ్‌పై ప్ర‌క‌ట‌న చేయించార‌న్నారు.ఈ విష‌యాని తాను మ‌ళ్లీ కాకినాడ స‌భ‌లో మాట్లాడుతూ రెండు పాచిపోయిన ల‌డ్లు ఇచ్చార‌ని వ్యాఖ్యనించార‌న్నారు.ప్యాకేజ్ ఇచ్చినందుకు సంబరాలు చేయించింది తెలుగుదేశంపార్టీయే కాని జ‌న‌సేన‌పార్టీ కాద‌న్నారు.ప్ర‌తిప‌క్షం కూడా అసెంబ్లీలో స‌మ‌ర్ద‌వంతంగా నిర్వ‌హించ‌లేక‌పోయింద‌న్నారు.2019 ఎన్నిల్లో రాష్ట్రంలోని 175 నియోజ‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేస్తుంద‌న్నారు.బ‌ల‌మైన సంక‌ల్పంతో ప్ర‌జ‌ల్లోకి వచ్చేన‌ని, అంద‌రం క‌ల‌సి క‌ష్ట‌ప‌డత‌మ‌న్నారు.వెనుక‌బాటు తనాని త‌రిమికొట్టేందుకు పోరాటం చేద్దామ‌న్నారు.నిజాయితీగా ప‌నిచేస్తేన‌ని,డ‌బ్బు కోసం రాజ‌కీయ‌ల్లో రాలేద‌న్నారు.చంద్ర‌బాబు లాగా విజ‌య‌డైరీ లాంటి సంస్ద‌ను నాశ‌నం చేసి హేరిటేజ్‌డైరీని లాభ‌ల్లో న‌డిపించ‌న‌ని,ప్ర‌భుత్వ సంస్ద‌ల‌ను కాపాడ‌త‌న‌ని చెప్పారు.అగ‌ష్టు త‌రువాత మ‌ళ్లీ వ‌చ్చి పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలి,అజెండాఏమిటి అనే విష‌యంపై మీతోనే చ‌ర్చిస్తానన్నారు.1972లో జైఆంధ్రఉద్య‌మం కోసం 300 మంది యువ‌త బ‌లిదానం చేశార‌ని,అలాంటి ప‌రిస్దితి రాకుడ‌ద‌న్నారు.జ‌న‌సేన‌పార్టీ ఓట్లును కొనే ప్ర‌భుత్వం కాద‌ని ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచే ప్ర‌భుత్వంగా వుంటుంద‌న్నారు.ఈపోరాటం మొద‌టి అడుగేన‌న్నారు.

LEAVE A REPLY