స్దానిక యువ‌త ఉద్యోగాలు అడిగితే స్కిల్స్ లేవంటారు-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

0
122

విశాఖపట్నంః గాజువాకలో ఎంతోమంది యువత ఉన్నారని,కానీ వారికి సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని,ఏమైనా అడిగితే స్కిల్స్ లేవని అంటారని,స్టీల్ ప్లాంట్ కోసం గాజువాక రైతుల భూములు తీసుకొని వారిని మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విశాఖ పర్యటనలో అధికార పార్టీ టీడీపీపై మండిపడ్డారు.రంగాపురం వైట్ హౌస్‌లో సమావేశంలో విశాఖలో నివసిస్తోన్న ఉత్తర భారతీయుల సమస్యలను గురించి తెలుసుకున్నంత‌రం అయ‌న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూదోపిడీ పెరిగిందని; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దోపిడీల రాజ్యం వస్తుందని చెప్పారని,కానీ మీరు చేసిందేమిటని టీడీపీని ఘాటుగా ప్రశ్నించారు. ఈ నెల 7న విశాఖపట్నంలో కవాతు నిర్వహిస్తున్నమ‌ని,మన కవాతు గల్లీ నుంచి ఢిల్లీస్థాయికి తెలియాలని అన్నారు.విశాఖపట్నంకు నష్టం ఎలా జరిగిందో చెబుతానంటు,,,విశాఖకు కార్పోరేషన్ ఎన్నికలు జరగలేదని,ఎన్నికలు జరిగి ఉంటే కనుక మనకు రూ.3500 కోట్లు కేంద్రం నుంచి నిధులు వచ్చేవన్నారు.ఎందుకంటే ఆ నిధులు ఎన్నికలు జరిగితేనే వస్తాయని, ఇక్కడ ఎన్నికలు జరిగితే మేం కాకుండా ఇంకా ఎవరు వస్తారోననే భయం టీడీపీకి ఉందని, అందుకే జరగలేదన్నారు.మనం రాకుంటే ఆ డబ్బులు మన చేతిలో పడవనే భయంతో అన్ని ప్రజలకు వెళ్లిపోతాయనే భయంతో ఎన్నికలు జరగలేదన్నారు.జనసేన పార్టీకి ఆర్గనైజేషన్ లేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తారని,అసలు చంద్రబాబుకు ఉందా అని పవన్ ప్రశ్నించారు.టీడీపీని చంద్రబాబు స్థాపించారా అని నిలదీశారు. వైసీపీ అధినేత జగన్‌లా తన తండ్రి ముఖ్యమంత్రి కాదని, సాధారణ పోలీస్ కానిస్టేబుల్ అన్నారు.మన ఇంట్లో.. మీలో ఒకరు వచ్చి పార్టీ పెడితే ఎలా ఉంటుందో అదే జనసేన అన్నారు.వాళ్లలా వేల కోట్లు లేవన్నారు. మా బంధువులు అందరినీ కూర్చోబెట్టి రాజకీయం చేసేందుకు నాకు పెద్దగా బంధువులే తెలియదని పవన్ అన్నారు. నా బంధువులు అంతా అభిమానులు, ప్రజలే అన్నారు.ప్రాంతాలు, జాతులు, కులాల కలయికే భారత్ అని పవన్‌ అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య తగాదాలు, జాతుల మధ్య వైరాలు సృష్టిస్తున్నారన్నారు. మనది వసుదైక కుటుంబమని, మన సంస్కృతిని మార్చేందుకు చాలామంది యూరోపియన్లు ప్రయత్నించారని, కానీ వాళ్లే మారిపోయారన్నారు. భారతీయతను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ తమదే అన్నారు.

LEAVE A REPLY