ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై పోరాటానికి న‌డుం బిగించిన ఏకైక నాయ‌కుడు-వంగ‌పండు

0
34

విశాఖ‌ప‌ట్నంః ఎటు చూసిన ప‌చ్చ‌ని భూములు,జ‌ల వ‌న‌రులు ఉన్నఉత్ర‌రాంధ్ర‌ప్రాంతాని పాల‌కులు కావాల‌ని నిర్ల‌క్ష్యంచేసి అభివృద్దికి దూరం చేశార‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవేద‌న వ్య‌క్తం చేశారు.బుధ‌వారం విశాఖ‌ప‌ట్నంలో ఉత్త‌రాంధ్ర మేథ‌వుల‌తో జ‌న‌స్వ‌రం పేర‌ట చ‌ర్య కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్ చలం సమన్వయ కర్తగా వ్యవహరించారు.ఈసంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఉన్న స‌హ‌జ వ‌న‌రులు,గ‌నుల‌పై కొంద‌రి దృష్టి ప‌డింద‌ని,వీటిని దోచే ప‌ని మొద‌లైంద‌న చెప్పారు.ఈ ప‌థ‌కంలో భాగంగానే ఇక్క‌వ ప్ర‌జ‌లు బ‌త‌క‌లేని ప‌రిస్దితులు సృష్టిస్తున్న‌ర‌న్నారు.
వంగ‌పండుః– ఈ సందర్భంగా వంగపండు మాట్లాడుతూ ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై పోరాటానికి న‌డుం బిగించిన ఏకైక నాయ‌కుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అని ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ప్రశంసించారు.చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్నో పార్టీల‌ను,ఎంద‌రో మ‌హా నాయ‌కుల‌ను చూశానని,వాళ్ళు వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోయారే తప్పా చేసిందేమీలేదని విమర్శించారు.ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి నాయ‌కుడిని చూడ‌లేదని, ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై, స‌మ‌స్య‌ల ప‌రిష్క‌ారానికి చిత్త‌శుద్ధితో ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు.
మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్ చలంః– ఓ వైపు కొండలు… మరో వైపు సముద్రం ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర.భూ భాగం తక్కువగా ఉంది.ఇక్కడ ఉత్పాదకత ఎక్కువ ఉండే ప్రాజెక్టులు రావాలి.అయితే అణు విద్యుత్ కేంద్రాలు లాంటివి తీసుకొచ్చి పెడుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో మిగులు భూములు లేవు.అయినా ఇక్కడే భూ సేకరణ చేస్తున్నారు.పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో మిగులు భూములు ఉన్నాయి.90 శాతం వెనుకబడ్డ ప్రజలు ఉన్న ప్రాంతమిది.ఇక్కడ బతకలేని పరిస్థితులు తీసుకు వచ్చారు కనుకనే ఇతర ప్రాంతాలకి వలసపోతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా గోనె సంచి చుట్టిన శవం కనిపించిందంటే అది ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన వాళ్లదే అవుతుంది. ‘అభివృద్ధి చేస్తున్నాము’ అంటున్నారు… అదేమీ మాకు అందటం లేదు. 2.65 లక్షల ఎకరాల కొల్లేరును దోచేశారు… ఆ నీళ్లు లేవు కనుక పట్టిసీమ పేరుతో గోదావరి నీళ్లు మళ్లిస్తున్నారు. అవి ఉత్తరాంధ్రకు రావాల్సినవి. మా భూములు… మా నీళ్లు మాకు కావాలి. మా ప్రాంత వెనుకబాటుతనం గురించి గళం వినిపిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెంట ఉంటామ‌న్నారు.

LEAVE A REPLY