చంద్రబాబు,జగన్‌ల‌తో కలిసి ఉమ్మడి పోరాటానికి నేను సిద్ధం-మీరు సిద్ద‌మేనా-ప‌వ‌న్‌

0
105

రేపు జ‌న‌సేన నిర‌స‌న క‌వాతు
విశాఖపట్నంః విశాఖ రైల్వే జోన్ కోసం తాను పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని,చంద్రబాబు, జగన్‌లు తనతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉన్నారా, తనతో కలిసి పోరాటం చేయగలరా అని జ‌న‌సేన అధ్య‌క్ష‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రశ్నించారు.తగరపువలసలో జనసేన పోరాట యాత్రలో పాల్గొన్న సంద‌ర్బంలో మాట్లాడుతూ,, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ రైల్వే జోన్‌పై మాట్లాడటం లేదన్న టిడిపి నేతలకు జనసేనాని గట్టి సవాల్ విసురుతూ ఇప్పటికే 6గురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని,మిగతా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని, అప్పుడు మీతో పాటు నేనూ వస్తానని, రైల్ రోకో చేద్దామన్నారు.టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీ మోహన్‌లకు రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంటే హేళన అయిపోయిందని పవన్ కళ్యాణ్ ఏకిపారేశారు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదోపిడీలే అన్నారు. జ్యూట్ మిల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని గంటా శ్రీనివాసరావును గెలిపించారని, కానీ పరిష్కారం కాలేదన్నారు. కాలుష్యంతో 24 జాతుల మత్స్య సంపద నాశనం అవుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.తెలుగుదేశం పార్టీ నేతల భూదోపిడీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.ప్రత్యేక హోదా నుంచి డీసీఐ వరకు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడింది జనసేన అన్నారు. ప్రధాని మోడీ అంటే చంద్రబాబుకే భయమని,కానీ నేను మోడీపై ధైర్యంగా మాట్లాడగలిగానని గుర్తు చేశారు. ఏపీ ప్రయోజనాలపై రాజకీయాలు పక్కన పెట్టి పోరాడేందుకు తాను సిద్ధమని, ఇతర పార్టీలు సిద్ధమా అని జనసేన నిలదీస్తోందన్నారు.

LEAVE A REPLY