ప్ర‌తి చిన్న ప‌నికి లంచం-ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే ఎదురుదాడి-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

0
95

విజ‌య‌న‌గ‌రంః రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం కావాలన్నా,కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగం ఇప్పించాలన్నా… రూ.5 లక్షలపైనే తెలుగు దేశం నాయకులు,ప్రజా ప్రతినిధుల అనుచరులు లంచాలు గుంజుతుంటే దీన్ని పాలన అంటామా?’ ఇలాంటి చర్యలను ప్రశ్నిస్తే నేను ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి మాట్లాడుతూన్న‌డ‌ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిప‌డ్డారు.సోమ‌వారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో జనసేన పోరాట యాత్రను సాగించారు.దేవి గుడి సెంట‌ర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఎటు చూసినా ఇసుక మాఫియా దోపిడీయే కనిపిస్తోందని,ఉత్తరాంధ్రను కూడా అమరావతిలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎందుకు అనుకోవడం లేదని ప్రశ్నించారు..పాలక వర్గాలు చేసే తప్పుల మూలంగా సామాన్యులు అవమానాలు, అన్యాయాన్ని, అసమానతల్ని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.చంద్రబాబు ఉత్తరాంధ్రపై నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారని, ఉత్తరాంధ్రలో సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికి దృష్టిపెట్టరు కాని పట్టిసీమను మాత్రం వేగంగా పూర్తి చేస్తారని, ఉద్యోగాలు,ఫించ‌ను,రేష‌న్‌కార్డు, ఇలా ప్ర‌భుత్వం ప‌థ‌కం ఏదైన రావ‌లంటే నాయ‌కుల‌కు లంచం ఇవ్వాల్సిందేన‌ని ఆరోపించారు.

LEAVE A REPLY