40 సంవత్స‌రాల అనుభ‌వం ఇసుక దొపిడి,భూక‌బ్జాల‌కు ప‌నికివ‌చ్చిందా-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

0
95

శ్రీకాకుళంః కోడి.రామమూర్తి స్పూర్తితో తాను కరాటే నేర్చుకునేందుకు వెళ్లాన‌ని,అలాంటి పాల‌కొండ గ‌డ్డ‌మీద నేడు మీ అంద‌రిని క‌లుసుకొవ‌డం ఎంతో సంతోషంగా వుంద‌ని,శ్రీకాకుళం నేల త‌ల్లికి నా పాద‌భివంద‌నమ‌ని జ‌న‌సేనాని పవ‌న్‌క‌ళ్యాణ్ అన్నారు.సోమ‌వారం .శ్రీకాకుళం జిల్లాలో పవన్ పోరాటయాత్ర భాగంగా పాలకొండలోని దుర్గగుడి నుంచి చెక్ పోస్ట్ వరకు నిర్వహించిన నిర‌స‌న కవాతులో ఆయన పాల్గొన్నారు.అనంత‌రం అయ‌న స్దానికుల‌ను ఉద్దేశించిన మాట్లాడుతూ అభిమానంతోటి,ప్ర‌మతో న‌లిపివేశార‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.ఉత్త‌రాంధ్ర‌కు న్యాయం జ‌ర‌గ‌న‌ప్పుడు,జ‌నంలో నుండి వచ్చేవారే జ‌న‌సైనికుల‌న్నారు.ఏపీకి ప్రత్యేకహోదాపై మొదటి నుంచీ చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేది కాదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అటకెక్కించారని, అడవిపుత్రులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తోటపల్లి రిజర్వాయర్ గురించి ప్రస్తావిస్తు 250 కోట్లు ఖ‌ర్చుచేసి వుంటే 60 వేల ఎరాలు సాగులోకి వచ్చివుండేవ‌న్నారు.ఈ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. రైతులు కంటతడి పెడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని వాపోయారు.అడ‌విపుత్రుల‌ను మోసంచేసి ఓట్లు వేయించ‌కోవ‌డ‌మే త‌ప్ప వారికి అండ‌గా నిలబ‌డే నాయ‌కుడే లేర‌న్నారు.ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను నేర‌వేర్చే ప్ర‌భుత్వ‌రావ‌లే త‌ప్ప ప్ర‌జ‌ల మోసం చేసే ప్ర‌భుత్వాలు ఆవ‌స‌రంలేద‌న్నారు.జంపాల‌కోట రిజ‌ర్వ‌య‌ర్ 1983లో ప్రారంభించాల‌ని ఇందుకు కేవ‌లం 16 కోట్ల రూపాయలు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతాయ‌ని,అయితే ముఖ్య‌మంత్రి 40 సంవ‌త్స‌రాల అనుభ‌వం దేనికి ప‌నికి వ‌చ్చింద‌ని ప్ర‌శించారు.40 సంవత్స‌రాల అనుభ‌వం ఇసుక దొపిడి చేయాడానికి ప‌నికి వ‌చ్చిందేమో ? ప్ర‌స్తుతం తెలుగుదేశం ప్ర‌భుత్వం సంపూర్ణఅవినితితో కూరుకుని పోయింద‌ని విమ‌ర్శించారు.

LEAVE A REPLY