10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 33,972 మంది విద్యార్థులు 10 GPA సాధించారు-సంధ్య‌రాణి

అమ‌రాతిః ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు అమ‌రావ‌తిలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు.ఏపీలో 6,21,634 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాశారని,ఇందులో 6 లక్షల 19 వేల 494 రెగ్యులర్ కాగా 10,588 ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని, మొత్తం 94.88 శాతం మంది పాస్ అయ్యారని వెల్లడించారు.వీరిలో బాలురు 94.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలిక‌ల్లో 95.09 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.అలాగే ప్రైవేటుగా పరీక్ష రాసిన విద్యార్థుల ఉత్తీర్ణత 58.80 శాతంగా వుంద‌న్నారు. ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసిన అబ్బాయిల్లో 56.72 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా,అమ్మాయిల్లో 61.82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 11,690 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరు అయ్యారని,వీటిలో 5464 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.గతంలో 17 స్కూళ్లలో సున్నా పాస్ పర్సంటేజ్ ఉండగా ఈసారి అది 3 పాఠశాలలకే పరిమితమయిందని వెల్లడించారు.పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత విషయంలో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 98.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, కనిష్టంగా నెల్లూరు జిల్లాలో 83.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు.ఇక మంచి పాస్ పర్సంటేజ్ నమోదుచేసిన పాఠశాలల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అగ్రస్థానంలో నిలిచాయన్నారు.ఇక్కడ 98.24 శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నారు.జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు..వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవని స్పష్టం చేశారు.అలాగే రెండ్రోజుల్లో ఈ మార్కుల మెమోలను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.రీ కౌటింగ్,రీ వెరిఫికేష‌న్‌కు చివ‌రి తేది మే 30 అన్నారు.జూన్ 6వ తేదిన అడ్వ‌న్స్ స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ధ‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది కాగా జూన్ 17 తేది నుండి అడ్వ‌న్స్ స‌ప్ల‌మెంట‌రీ ఫ‌లితాలు ఉంటాయ‌న్నారు.కేర‌ళ రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న స్పోర్ట్ కోటా విధనం ఇక్క‌డ‌ ఆమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని,ప్ర‌తిపాద‌నలు ప్ర‌భుత్వ అనుమ‌తి కోసం పంపించ‌డం జ‌రిగిద‌న్నారు.

LEAVE A REPLY