ఇరాన్ నుండి అయిల్ దిగుమ‌తులు అపివేస్తే-భార‌త్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు

0
84

అమ‌రావ‌తిః ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను నిలిపివేస్తే,తాము భార‌త్‌కు ఇస్తున్న స్పెషల్ ప్రివిలేజ్ (ప్రత్యేక అధికారాలు) హోదాను కోల్పోతుందని హెచ్చరించింది.ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేసి,రష్యా,ఇరాక్,సౌదీ అరేబియాలాంటి దేశాలతో ఆ లోటును పూడ్చుకోవాలని భారత్ భావిస్తే అది పెద్ద తప్పిదమే అవుతుందని ఇరాన్ రాయబారి మసూద్ రెజ్వానియన్ రహాఘి అన్నారు.చబాహర్ పోర్టు విస్తరణ,దానికి సంబంధించిన కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతామన్నహామీని భారత్ ఇంతవరకు పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు.ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను నిలిపివేస్తే భారతే ఇబ్బందులు పడుతుందని,అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వార్థపూరిత విధానాలతో ప్రపంచాన్నిగుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు.అమెరికా సన్నిహిత దేశాలన్నీ ఇరాన్ నుంచి దిగుమతులను ఆపివేయాలని ట్రంప్ పిలుపు నిచ్చారు.అమెరికాతో సన్నిహితంగా ఉన్న భారత్ కూడా దిగుమతులను నిలిపివేయాలని ఆయన కోరారు.ఈ నేపథ్యంలోనే భారత్ పై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.మరోవైపు,చబహర్ పోర్టు అభివృద్ధి కోసం ఇరాన్,భారత్,ఆఫ్ఘనిస్థాన్‌లు ఒప్పందం చేసుకున్నాయి.ఈ పోర్టు ద్వారా ఆయా దేశాల మధ్య రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించిన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY