హానర్‌ 10 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడదల

అమ‌రావ‌తిః స్మార్ట్‌ఫోన్స్ రంగంలో చైనా కంపెనీలు ఒక దానితో ఒక‌టి పోటీ ప‌డుతు,డిపరెంట్ వేరియంట్స్‌ను అందుబాటు ధ‌ర‌ల్లో విడుద‌ల చేస్తున్నాయి.ఈ కోవ‌లో హువావే బ్రాండ్‌కింద హానర్‌ స్మార్ట్‌ఫోన్లు భారతీయ యువ‌త‌ను పలకరిస్తు,కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.తాజాగా హానర్‌ 10 లైట్‌ అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో కంపెనీ విడదల చేసింది హానర్‌.హానర్‌ 8 లైట్‌, 9 లైట్‌ డివైస్‌ల వరుసలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.డ్యూ డ్రాప్‌ డిస్‌ప్లే,ఏఐ ఆధారిత 24ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.రెండు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది.ధరలు 13,999 రూపాయల నుంచి ప్రారంభం.ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌ జనవరి 20నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి లభ్యం. అలాగే జియో నుంచి 2200 క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ.2800 క్లియర్‌ట్రిప్‌ వోచర్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది.ఫోన్ ఫీచ‌ర్స్ః 6.21 అంగుళాల డిస్‌ప్లే,,ఆండ్రాయిడ్‌ పై9,,ఆక్టాకోర్‌ కిరిన్‌710 ప్రాసెసర్‌,,4జీబీ/6జీబీ ర్యామ్‌,,64జీబీస్టోరేజ్‌,,13+2 ఎంపీ రియర్‌ కెమెరా,,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,,3400 ఎంఏహెచ్‌ బ్యాటరీలు ఉన్నాయి.

LEAVE A REPLY