త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు-నెల్లూరుకు ..?

0
200

చెన్నైః తుఫాను గండం ద‌క్ష‌ణ‌ది రాష్ట్రల‌కు త‌ప్పేట‌ట్టు లేదు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు లక్షద్వీప్‌లో భారీ వర్షాలు పడుతాయని, తుపాను వస్తోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కన్యాకుమారి జిల్లా అతలాకుతలం అయ్యింది.రైళ్లు, వాహనాలు ఎక్క‌డిక్క‌డ నిలిచి పోయాయి. తుపాను కారణంగా కన్యాకుమారితో సహ ఆ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి నాగర్ కోవిల్, తివేండ్రం వైపు వెళ్లే బస్సులు, రైళ్ల సంచారం పూర్తిగా నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో చేట్లు కుప్పకూలడంతో అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి.శ్రీలంక నుంచి ఇప్పటికే 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, కన్యాకుమారిలో 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి తుపానుకు దారి తీస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సముద్రంలో చేపలు పట్టడానికి ఎవ్వరూ వెళ్లకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.నెల్లూరు జిల్లాకు ఎలాంటి ముప్పు వుందో…?

LEAVE A REPLY