విశాఖ సముద్ర తీరంలోని ఔటర్ హార్బర్‌లోని నౌకలో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరంలోని ఔటర్ హార్బర్‌లో ఉన్ననౌక ‘జాగ్వార్‌ టగ్‌’లో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 28 మంది సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 29 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఔటర్ హార్బర్‌లో సివిల్ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. జాగ్వార్ నౌకను పోర్ట్‌ పనుల కోసం విశాఖ హార్బర్‌ అద్దెకు తీసుకుంది.