ఆసుప‌త్రులు ప‌నితీరుపై టాస్క్‌ఫోర్స్‌-పూనం.మాల‌కొండ‌య్య‌

ఓ.పి పెరగాల్సిన అవ‌స‌రం వుంది.నెల్లూరుః రాష్ట్ర వ్యాప్తంగా వైద్య‌సేవాలు,ఆసుప‌త్రుల ప‌నితీరుపై టాస్క్ ఫోర్స్ త్వ‌ర‌లో ఏర్పాటు చేస్తున్న‌మ‌ని,నెల్లూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రులో అన్నిఅధున‌త‌మై సౌక‌ర్యాలు వున్న‌య‌ని,వైద్య కళాశాల‌లో సీట్లు పెంపు,పీజీ సీట్లు తీసుకుని వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ‌ ముఖ్య‌కార్య‌ద‌ర్శి పూనం.మాల‌కొండ‌య్య చెప్పారు.సోమ‌వారం నెల్లూరులోని స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో వార్డు స్దాయిలో రోగుల‌ను అడిగి అక్క‌డ అందుతున్న సేవాల‌పై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.అనంత‌రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసుప‌త్రిలో సేవాల అందించే విష‌యంలో డాక్ట‌ర్ల ప‌ద్ద‌తులు మార్చుకొవాల‌ని,డాక్ట‌రు.బుజ్జ‌య్య‌,డాక్ట‌రు మస్తాన్‌బాషాలు అంకిత భావంతో సేవాలు అందిస్తున్న‌ర‌ని తెలిపారు.ప‌నివేళ్ల‌లో డాక్ట‌ర్లు ఖ‌చ్చితంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు.స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.
మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక అసుప‌త్రిః-ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ఆధ్వ‌ర్యంలో మ‌హిళ‌కు ప్ర‌త్యేక ఆసుప‌త్రి నిర్మించాల‌ని,ఇందుకు త‌మ వంతు స‌హాకారం పూర్తిగా వుంటుంద‌ని మేయ‌ర్ అజీజ్ పూనం.మాల‌కొండ‌య్య తెలిపారు.ఆసుప‌త్రి అభివృద్ది క‌మిటీ ఛైర్మ‌న్ చాట్ల‌.న‌ర‌సింహ‌రావుతో క‌లసి అయ‌న విన‌తి ప‌త్రం అందించారు.