ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే వాడే తన దృష్టిలో నిజమైన నాయకుడు-జ‌న‌సేనాని

ఒంగోలుః రాజ‌కీయ‌ల్లో నాయకులు కాదలచుకున్నక‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తు కొంత‌ సమయం తీసుకోవాలని,అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అంతా నాయకులు కావచ్చు కానీ, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే వాడే తన దృష్టిలో నిజమైన నాయకుడని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మంగ‌ళ‌వారం జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీకి అభిమానులు ఎంత బలమో, ఒక్కోసారి అంతే బలహీనత కూడా అవుతున్నారని, కట్టలు తెంచుకున్న అభిమానం పాలపొంగులాంటిది కారాదని సూచించారు.హీరోగా ఎదిగిన తర్వాత కూడా 2009లో నాయకుడిని అయిపోవాలని ఆశపడలేదని, ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోలేదన్నవిషయాన్ని గుర్తుచేసుకున్నారు.తన కంటే అనుభవం ఉన్న వ్యక్తి ముందుకు వెళ్తుంటే వెనుక నుంచి తన వంతు తోడ్పాటు అందించానని,జనసైనికులు చేయాల్సింది కూడా అదేనని,ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఈ కుళ్లు రాజకీయాలను భరిస్తూ,సరైన వేదిక లేక ముందుకు రాలేకపోయిన స‌మాజంలో మేధ‌వులైన‌ జడ్జిలు,ఆఫీసర్లు,వ్యాపారవేత్తలు,విలువలు, అనుభవం ఉన్ననాయకులు జ‌న‌సేన‌ కోసం వచ్చారని అన్నారు.వారికి మనం వెనుక ఉండి మద్దతు ఇస్తేనే మనం కోరుకుంటున్న మార్పు సాధ్యపడుతుందని,అలా చేయలేకపోతే మన బలం ఒక చిన్న దారపుపోగే అవుతుందని అన్నారు.

LEAVE A REPLY