క‌డ‌ప జిల్లాలో క‌రువులేకుండా చేయాడ‌మే ల‌క్ష్యం-ముఖ్య‌మంత్రి

0
122

క‌డ‌పః చిత్రవ‌తి న‌దిపై 5 లిప్ట్‌ల‌తో నీటిని అందించే కార్య‌క్ర‌మాని ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని,నీరంటే బంగారంతో స‌మాన‌మ‌ని,నీరు అందింతే రైత‌న్న‌లు బంగారం పండిస్తార‌ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుద‌వారం కడప జిల్లా పులివెందులలోని పార్ల‌ప‌ల్లిలో నిర్వహించిన జన్మభూమి- మా వూరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,సీమ ప్రాంతంలో నీరు చూడటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నను అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పట్టిసీమ నుంచి నీరు తీసుకొచ్చామ‌న్నారు. రాయలసీమను హ‌ర్టీక‌ల్చ‌ర్‌ హబ్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నమ‌ని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు.రాయలసీమలో అభివృద్ధి జరగాలంటే త‌నకు సహకరించాల‌ని, పులివెందులలో తెదేపాను గెలిపించకపోయినా అభివృద్దికి నిధులు ఇస్తూనే ఉన్నాట్లు చెప్పారు. క‌డ‌ప‌లో ముఠా కక్షల వల్ల కంపెనీలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ప్రజలెవరైనా 1100 నంబరుకు ఫోన్‌ చేస్తే వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. టెక్నలెడ్జీని ఉప‌యోగించుకుని,రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్న‌స్ ఆమ‌లు చేస్తున్న‌మ‌న్నారు.ప్రతి కుటుంబం నెలకు రూ.10వేల ఆదాయం సాధించే విధంగా కార్య‌చ‌ర‌ణ‌పై శ్రద్ధ పెట్టామన్నారు.

LEAVE A REPLY