పొదలకూరు తహసీల్దార్ కార్యాల‌యం కేంద్రంగా భూ ఆక్ర‌మాలు

0
217

ప్ర‌భుత్వ భూముల‌ను దొచుకో-అపై దాచుకో
నెల్లూరుః ప్ర‌భుత్వ భూముల‌ను దొచుకో,,,అపే దొంగ పాస్‌పుస్త‌లు సృష్టించి దాచుకో లేక పోతు నీ ఇష్టం వ‌చ్చిన ధ‌ర‌కు అమ్ముకో అన్నచంద‌నా,,ప్ర‌భుత్వ భూములకు దొంగ పాస్‌పుక్తాలు,1బి, అడంగ‌ళ్లు ఏది కావ‌లంటే అది య‌ధేచ్చ‌గా పొద‌ల‌కూరు త‌హ‌సీల్దారు కార్యాల‌యం కేంద్ర జ‌రిగిపోతున్నాయి.ప్ర‌భుత్వ భూముల‌ను దాచుకున్న వారు,వాటికే ప్ర‌భుత్వ ప‌థకాల ద్వారా స‌బ్సిడీపై ల‌క్ష‌ల రూపాయ‌ల ల‌బ్దిపొందుతూన్నారు.ఈ తంతు అంతా తహసీల్దార్ అన్నదాత నిర్మలానందబాబా క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుంద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్న‌యి.నెల్లూరు న‌గ‌రానికి కేవ‌ల 30 కి.మీ ప‌రిధిలో జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హ‌రంపై ఉన్నత‌స్దాయి అధికారులు ఏలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారు…? ప‌్ర‌భుత్వ భూముల నేప‌ధ్యం ఇలా వుంది….
తారు మారు ప్ర‌దేశంః– పొదలకురు మండలం బిరదవోలు సర్వే నెంబర్ 592లో ఇప్పటికి 7.63ఎకరాలు మేత పోరంభోకు భూమి ఉంది. మేత పోరంభోకు భూమిని అనాధీనంగా మార్చకుండా పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. అయితే బిరాదవోలులో 592 సర్వే నెంబర్ తోపాటు మరికొన్ని సర్వే నెంబర్లలో కొంతమంది దొంగపాసుపుస్తకాలు సృష్టించి రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకున్నారు.2013లో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అప్పటి తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు దొంగ పాస్ పుస్తకాలు కలిగిన వారిని గుర్తించి రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించేందుకు ఆర్డీవో, కలెక్టర్‌కు నివేదిక పంపి అనుమతులు పొంది వాటిని రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించారు.అయితే ఆ సమయంలో 592-2లో 4-50ఎకరాలకు దొంగ పాసుపుస్తకం కలిగి ఉన్న సిద్ధం సుజాత స్థానంలో బిరదవోలు వీర్ఏ ఉడతా వెంకటసుబ్బయ్య సహకారంతో పొదలకురు విఘ్నేశ్వరపురం కాలనీకి చెందిన తోడేటి వెంకటర‌మ‌ణ‌మ్మ పేరుతో దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి తహసీల్దార్ నిర్మలానందబాబాకు భారీ మొత్తంలో డబ్బులిచ్చి ముటేషన్ చేయించి, 1-బీ, అడంగల్లో ఎక్కించారని,వీఆర్వో, ఆర్ఐ కూడా పూర్తి సహకారం అందించారని స్దానికులు ఆరోపిస్తున్నారు.ఒక వేళ ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చి ఉంటే అసైన్‌మెంట్ కమీటీలో సదరు పేరు నమోదై ఉండాలి, కొనుగోలు ద్వారా సంక్రమించి ఉంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు జత చేయాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం జరిపిన 7విడతల భూ పంపిణీలలో ఎక్కడ తోడేటి వెంకటమ్మ పేరు ఆమోదించబడి లేదు. ఎలాంటి కొనుగోలు డాక్యుమెంట్లు లేవు. వీటన్నింటినీ పరిశీలించకుండా మేత పోరంభోకు భూమిని తోడేటి వెంకటమ్మకు చెందిన స్వంత భూమిగా 4.5 ఎకరాలను తహసీల్దార్ నిర్మలానందబాబా రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేసి, సదరు భూమికి సన్నకారు రైతు సర్టిఫికేట్ మంజూరు చేశారని, ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఉపాధిహామీ పథకంలో నిమ్మ చెట్లు పెట్టుకొని ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారన్నారని తెలిపారు.ఈ త‌తంగ‌పై ఉన్న‌త‌స్దాయి విచార‌ణ జ‌రిపిస్తే ఆస‌లు దొంగ‌లు బ‌య‌ట ప‌డ‌తార‌ని,,ల‌క్ష‌ల విలువ చేసే ప్ర‌భుత్వ భూములు ఆన్యాక్రాంత కాకుండా ఉంటాయ‌ని కోరుతున్నారు.మ‌రి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే…?
PART-2-రాపూరులోని ప్ర‌భుత్వ భూముల్లో జ‌రిగిన తంతు వార్త త్వ‌ర‌లోనే ప్ర‌చురిస్తాం..

LEAVE A REPLY