నాకు తెలియ‌కుండా మెడికో లీగల్ కేసు న‌మోదు చేస్తావా- నా కొ……-సూప‌రింటెండెంట్ !

0
437

నెల్లూరుః నెల్లూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో డాక్ట‌ర్స్ మ‌ధ్య వైష‌మ్య‌లు తార‌స్దాయికి చేరుకున్నాయి.ఎంత‌గా అంటే ఆసుప‌త్రి సూపరింటెండెంట్ రాధ‌కృష్ణ‌రాజు,మ‌రో డాక్ట‌రు ప‌రశురామ్‌లో కొట్టుకునేంత స్దాయికి చేరుకుంది.శుక్ర‌వారం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోని క్యాజువాలిటీ వార్డులో మెడిక‌ల్ విద్యార్దుల‌కు ప‌ర‌శురామ్ క్లాస్ తీసుకుంటున్న స‌మ‌యంలో ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిసింది.విష‌యంలోకి వ‌స్తే,ప‌ట్ట‌ణంలో పందుల స‌చారం ఎక్క‌వ కావ‌డంతో,నెల్లూరు మునిసిపాల్ కార్ప‌రేష‌న్ సిబ్బంది,పందుల‌ను పెల్లెట్ గన్స్‌తో కాల్చి వేస్తున్నారు.శుక్ర‌వారం సంత‌పేట ప్రాంతంలో సిబ్బంది పందుల‌ను కాల్చివేస్తున్న స‌మ‌యంలో దేవా (6) బాలుడు,అప్రాంతంలో ఉండ‌డంతో,పందుల‌కు త‌గిలే పెల్లెట్‌,దేవాకు కుడి క‌ణ‌త వ‌ద్ద త‌గిలింది.దింతో బాలుడు పెద్ద‌గా కేక‌లు వేస్తు ప‌డిపోయాడు.మునిసిపాల్ సిబ్బంది బాలుడిన చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.డ్యూటీలో ఉన్న డాక్ట‌రు ప‌ర‌శురామ్ వెంట‌నే బాలుడుకి చికిత్స చేసే నిమిత్తం పెల్లెట్ త‌గిలింది కాబ‌ట్టి మెడికో లీగ‌ల్ కేసు క్రింది న‌మోదు చేసి చికిత్స చేసి,పెల్లెట్ త‌గ‌ల‌డం వ‌ల్ల ప్రాణ‌పాయం ఏమైన వుందా ? అనే విష‌యం నిర్దారించుకునేందుకు ఎక్స‌రేకు పంపించాడు.ఇదే స‌మయంలో అక్క‌డి చేరుకున్న ఆసుప‌త్రి సూపరింటెండెంట్ రాధ‌కృష్ణ‌రాజు,ఏవ్ర‌డా ఇక్క‌డ కేసును మెడికో లీగ‌ల్ కేసు క్రింద న‌మోదు చేసిందంటు,ఆస‌భ్య ప‌ద‌జాలం విద్యార్దుల ముందే వాడాడు.డాక్ట‌రు ప‌ర‌శురామ్ తన‌కి రూల్స్ తెలుసున‌ని,రూల్స్ ప్ర‌కార‌మే తాను న‌డుచుకున్న‌ని చెప్ప‌డు.దింతో ఆగ్ర‌హించిన సూపరింటెండెంట్ మెడిక‌ల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప‌ద్మ‌జ‌రాణి పిలించి ఆమె ముందు పంచాయితీ పెట్టి మ‌ళ్లీ బూతులు లంక్కించుకున్నాడు.దింతో ప‌రుశురామ్ మాట్లాడుతూ బూతులు మాట్లాడ వ‌ద్ద‌ని,మ‌ర్యాదగా మాట్లాడాల‌ని చెప్ప‌డంతో,కోపంతో ఉగిపోయిన సూప‌రింటెండెంట్ కాలుతో ప‌రశురామ్‌ను త‌న్నేడని తెలిసింది.జ‌రిగిన సంఘ‌ట‌న‌తో అవాక్కు అయిన ప‌ర‌శురామ్ త‌న‌కు జ‌రిగిన ఆవ‌మానాని జిల్లా ఉన్న‌త‌ధికారుల‌కు ఫిర్యాదు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలియ వ‌చ్చింది.
కోస మెరుపుః- మెడికో లీగ‌ల్ కేసు రూల్స్ ప్ర‌కారం న‌మోదు చేస్తే,సూప‌రింటెండెంట్‌కు ఎందుకు అంత కోపం వ‌చ్చిందంటే కార్ప‌రేష‌న్ హెల్త్ ఆఫీస‌ర్ ఈయ‌న బంధువు కావ‌డం,మెడికోలీగ‌ల్ కేసు అయితే,విచార‌ణంలో ప‌ట్ట‌ణంలో ప్ర‌జ‌లు తిరుగుతున్న స‌మయంలో ఎలాంటి ముందు జాగ్ర‌త్త‌లు లేకుండా,పెల్లెట్ గ‌న్ వాడి నందుకు హెల్త్ ఆఫీస‌ర్ బాధ్యుడు కావ‌ల్సి వ‌స్తుంద‌ని,అందుకే తాన‌పై సంస్క‌ర హీనంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని డాక్ట‌ర్ ప‌రశురామ్ తెలిపారు.
జ‌రిగిన ఘ‌ట‌న‌పై జిల్లా ఉన్న‌త‌ధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాల్సిందే ??

LEAVE A REPLY