ప్రొఫెసర్ అనుమానాలుంటే నా రూముకి రావచ్చు కదా అంటాడు ?

ఇద్ద‌రు మంత్రులు క‌థ‌ను కంచికి చేరుస్తారా?నెల్లూరుః నెల్లూరు,ప్ర‌భుత్వ ఆసుప‌త్రి,మెడికల్ కాలేజీలో వైద్యుల‌,ఆధ్యాపకుల ప్ర‌వృత్తి వికృతంగా మారుతుందా అంటే నిజ‌మే అనేందుకు సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి.గురువారం నెల్లూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్‌ ప్రొఫెసర్ చంద్రశేఖర్ లైంగిక చేష్టలు ఎలాంటివో మెడికల్ కాలేజీలో MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నబాధిత వైద్య విద్యార్ధిని బ‌య‌ట పెట్టింది.మా ప్రొఫెసర్ అవసరం లేకపోయినా కల్పించుకుని,అనుమానాలుంటే నా రూముకి రావచ్చు కదా అంటాడు.అంతే కాదు,, అనవసరంగా నామీద చేతులు వేస్తుంటాడు,కావాలనే నన్ను తాకుతుంటాడు.ప్రొఫెసర్ దుర్భుద్దిని గ్రహించి చాలాసార్లు మర్యాద కాదని చెప్పాను.నేను మీ బిడ్డ లాంటిదాన్నిఅని చెప్పాను.అయినా ఆ ప్రొఫెసర్ నుంచి నాకు వేధింపులు ఆగలేదు.ఈరోజు సెమినార్ జ‌రిగే రూమ్‌లో అంద‌రు చూస్తుండ‌గా నామీద చేయి వేశాడు.దీంతో తట్టుకోలేక మా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాను అన్న‌ది,తన పట్ల ప్రొఫెసర్ వ్యవహరించిన వైఖరిని ప్రిన్సిపల్ కి కూడా విద్యార్ధిని ఫిర్యాదు చేసింది.లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతోనే బాధిత విద్యార్ధిని బంధువు ప్రొఫెసర్ పై దాడి చేశాడు.గతంలో చంద్రశేఖర్ పై ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకొలేద‌ని,దింతో స‌ద‌రు ప్రొఫ‌స‌ర్ త‌న వ‌క్ర‌బుద్దిని య‌ధేచ్చ‌గా కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం.ఇదే ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మ‌రి కొంత మంది డాక్ట‌ర్లు,,మ‌హిళ సిబ్బంది ప‌ట్ల ఆస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ర‌ని,అయితే నోరువిప్ప‌తే,త‌మ ఉద్యోగ‌ల‌కు ఎక్క‌డ ఏస‌రు పెడుతారో అన్న భ‌యంతో మ‌హిళ‌లు నోరు విప్ప‌డం లేద‌న్న గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి.ఏది ఏమైన ష‌రామాములే,,,,రెండు రోజుల పాటు పోలీసుల ఎంక్వేయిరీలు,మీడియా స‌మాచారం త‌రువాత ఉన్న‌త స్దాయి నుండి వ‌చ్చే ఫోన్‌లు,బాధిత విద్యార్దినినికి వారి ప‌ద్ద‌తుల్లో స‌ర్దిచెప్పి,,,,???????