ప్ర‌భుత్వ భూములు దొచుకో-అపై దాచుకో-ద‌టీజ్ బాబా

0
159

మంత్రి అయిన ఎమ్మేల్యే అయినా..?
నెల్లూరుః మేత పోరంబోకును మేసేందుకు రెవెన్యూశాఖ‌లో మండ‌ల స్దాయి అధికారుల‌కు వున్న అవ‌కాశ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకొవాల్సిన అవ‌స‌రం ఉండదంటే అతిశ‌యోక్తి కాదు.స్దానిక ఎమ్మేల్యేకు,జిల్లా మంత్రికి సైతం చుక్కాలు చూపిస్తున్న త‌హ‌సిల్దారు త‌మ మండ‌లంలో వ‌చ్చిన‌ప్ప‌టి నుండి పాస్‌పుస్త‌కాల క‌ష్ట‌లు మొద‌లైయ్యాని స్దానికులు వాపోతున్నారు.స్దానికులు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం ప్ర‌స్తుతం పొద‌ల‌కూర‌లో ప‌నిచేస్తున్న నిర్మలానందబాబా,,గతంలో రాపూరులో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో పంగిలి తుర్రవారిపాలెం లోని సర్వేనెంబర్ 1లో 4309-14 ఎకరాలు అడవి పోరంబోకు భూమిలో సుమారు 180ఎకరాలు వరకు పలువురి పేరుతో, స్వంత భూములుగా రికార్డుల్లో ఎక్కించి లక్షలాది రూపాయలు నొక్కేశాడ‌ని, ఒక్కొక్కరి పేరుతో 25, 30ఎకరాలు నమోదు చేశాడ‌ని ఆరోపించారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం 25ఎకరాలు నుంచి రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేయాలంటే సంబంధిత ఆర్డీవో అనుమతులు పొందాల్సి ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి అనుమతులు పొందలేదు.రాపూరు సర్వే నెంబర్ 1114లో సుమారు 902ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది.సదరు భూమిలో 7 ఏళ్లుగా CRPC 145అమలులో ఉంది. అయినప్పటికీ తహసీల్దార్‌గా నిర్మలానందబాబా అక్కడ కూడా దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి స్వంత భూములుగా నమోదు చేశార‌ని ఇందుకు సంబంధించిన ప‌త్రాలు త‌మ ద‌గ్గ‌ర వున్న‌యాని తెలిపారు.
మంత్రి ఆదేశాలు బేఖాత‌రుః-జిల్లా మంత్రి గ‌త సంవ‌త్స‌రం ఇంకుర్తిలో వున్న ప్ర‌భుత్వ భూమిలో అక్క‌డ నివాస‌ముంటున్న గిరిజ‌నుల‌కు ప‌ట్టాలు ఇవ్వాల్సిందిగా సద‌రు త‌హ‌సిల్దారు అదేశిస్తే,వారికి ప‌ట్టాలు ఇవ్వ‌కుండా,ప్ర‌తి ప‌క్ష‌పార్టీ వాళ్ల‌ను రెచ్చ‌కొట్టి స‌ద‌రు స్దలాల‌పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే చేశాడ‌ని గ్రామ‌స్దులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మేల్యే ప‌నులుః-నియోవ‌ర్గంలోని ప్ర‌జ‌లు భూముల‌కు సంబంధించి మ్యూటేష‌న్ చేయించుకోవాలంటే,స‌ద‌రు ఎమ్మేల్యే సోమ‌వారం నాడు జ‌రిగే గ్రీవెన్స్ హాజ‌రై,త‌న మనుషుల‌కు సంబందించిన ప‌నులు చేయించ‌కొవాల్సి దుస్దితి నెలకొందంటే,ద‌టీజ్ ప‌వ‌ర్ ఆఫ్ నిర్మలానంద‌బాబా…
బాబా తీరు స‌ప‌రేట్ఃఅంద‌రు అధికారులాగా బాబా ఒకే పెన్నుతో ప‌నిచేయాడు,కాగిత‌ల‌పై సంతకాలు కావ‌లంటే బ‌రువు త‌గిలితే పెన్ను…లేదంటు పెన్సిల్…పెన్సిల్‌తో ప‌నిచేశాడంటే,,,స‌ద‌రు ఫైలు గిరికిటాలు తిర‌గాల్సిందే,,అది మినిస్ట‌ర్ తాలుక అయిన ఎమ్మేల్యే తాలుక అయిన‌..బాబా పనులు పూర్తి చేసేందుకు అయ‌న న‌మ్మినబంటు సిద్దంగా వుంటారు.సార్ ముత్తుకూరులో ప‌నిచేసిన స‌మ‌యంలో మంచి పేరు ప్ర‌తిష్టాలు వున్న‌యంటే,,సార్ కాలిబ‌ర్ అర్దంచేసుకొవాచ్చు..మ‌రి దిన‌పైన అధికారులు,మంత్ర‌లు,ఎమ్మేల్యే ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిదే..?

LEAVE A REPLY