రైతు కుటుంబం యూనిట్‌గా నేడు రూ.1000జమ,మార్చిలోమరో 3వేలు

వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్క‌డ‌పః రాష్ట్రంలో రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి,వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నఅన్నదాత సుఖీభవ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ కలెక్టర్లను కోరారు.సోమవారం వెలగపూడి నుంచి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంపై కలెక్టర్లు, స్టేట్ లెవెల్, జిల్లాస్థాయి బ్యాంకర్లు,వ్యవసాయ శాఖ అధికారులు తదితరులతో ఆర్.టి.జి.ఎస్ డైరెక్టర్ బాబుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ,పిఎం కిసాన్ పథకం క్రింద ఐదుఎకరాల లోపు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగిందన్నారు.ఈ మేరకు రాష్ట్రంలో ప్రజా సాధికార సర్వే డాటాను,వెబ్ లాండ్‌కు లింక్ చేసి ఐదు ఎకరాల లోపు ఉన్నప్రతి రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని 49,19,188 మందికి సోమవారం తక్షణం వెయ్యి రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.సదరు రైతుల వివరాలను జిల్లావ్యాప్తంగా రేపు మంగళవారం రెవిన్యూ విలేజిలలో ప్రదర్శించాలని సూచించారు.అర్హత ఉండి 1000 రూపాయలు అందని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే ఎంపీఈవోలను,వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని చెప్పారు.అలా వచ్చిన అర్జీలను కూడా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.భర్త, భార్య, మైనర్ పిల్లలను కలిపి ఒక రైతు కుటుంబంగా దాన్నిఒక యూనిట్ గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.ఐదెకరాల లోపు ఉన్న రైతులకు పిఎం కిసాన్ పథకం కింద నమోదైన రైతులకు సంవత్సరానికి రూ.6వేలు వస్తుందని,అలాంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.9వేలు ఇస్తున్నట్లు చెప్పారు.పిఎం కిసాన్ పథకం కవర్ కాని ఐదు ఎకరాల పైబడి ఉన్న పెద్ద రైతులకు కూడా సంవత్సరానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.పొలం లేని కౌలు రైతులు కూడా 2019 జూన్ లో భూమిని కౌలుకు తీసుకున్నవారికి కూడా సంవత్సరానికి రూ.15వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు.