గోదావ‌రి లాంచీ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 22 మృతుదేహాలు వెలికితీత‌

0
91

తూర్పుగోదావరిః బుధ‌వారం సాయంత్రం దేవిప‌ట్నం మండ‌లం ప‌రిధిలోని మాంటూరు వ‌ద్ద జ‌రిగిన లాంచీ మునక పెను విషాదం అప్తుల‌కు నింపింది.ఈ ఘ‌ట‌నలో 36 మంది మృతిచెందిన‌ట్లుగా స‌మాచారం.ఇప్పటివరకు 12 మంది మృతదేహాలను వెలికి తీయగా,మరో 10 మృతదేహాల కోసం నేవీ సిబ్బంది గాలిస్తున్నారు.ఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది.లాంచీలో ఉన్న తమవారి ఆచూకీ కోసం నిన్నటి నుంచి ఎదురుచూసిన స్థానికులు మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు.లాంచీ నదిలో 45 అడుగుల లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది నదిలో గాలించి లాంచీని గుర్తించారు. అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. లాంచీ తలుపులు తెరచుకోలేదు.ఫలితంగా తాళ్లు కట్టి ఇతర బోట్లు, క్రేన్ల సాయంతో బోటును బయటకు లాగారు.సంఘటనా స్థలానికి చేరుకున్న‌సీఎం చంద్రబాబు మృతదేహాల వెలికితీతను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.NDRF,STRF,NAVY ల‌కు చెందిన 126 మంది సహాయక చర్యలు చేపట్టారని,నిన్న రాత్రి సమయంలో చీకటి నెలకొనడంతో ఏమీ చేయలేకపోయారన్నారు.ఈ ఉదయం నుంచి ఆపరేషన్‌ ఉద్ధృతం చేసి చేసి అన్నివిధాలా ప్రయత్నం చేసి ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు.ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.బోటు నిర్వాహకుల తప్పిదం వల్లే ఈ ఘోరం చోటుచేసుకుందని,బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.

LEAVE A REPLY