32 కి.మీ అప్ప‌న్న గిరి ప్ర‌ద‌క్ష‌ణ ప్రారంభం

విశాఖ‌ప‌ట్నంః గిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణతో సమానమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.విశాఖపట్టణం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశినాడు గిరి ప్రదక్షిణ ప్రారంభించి పౌర్ణమి నాటి ఉదయం సింహాచలేశుని దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది.గిరి ప్రదక్షిణ సోమ‌వారం ప్రారంభమైంది.ఈ సందర్భంగా తొలి పావంచా వద్ద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిరాజు పాల్గొన్నారు.సింహాచలం కొండల చుట్టూ 32 కిలో మీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణం చేయనున్నారు.ఈ గిరి ప్రదక్షిణలో సుమారు పది లక్షల మంది భక్తులు పాల్గొంటారని ఆలయ అధికారుల అంచనా. భక్తుల కోసం పలుచోట్ల వైద్య శిబిరాలు,తాగునీరు, ప్రసాద వితరణ నిమిత్తం దేవస్థానం ఏర్పాట్లు చేసింది.ఇదిలా ఉండగా, గిరి ప్రదక్షిణ చేసేందుకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.గిరి ప్రదక్షిణ జరిగే మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే నిమిత్తం విశాఖ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.

LEAVE A REPLY