గిరిజ‌నుల‌కు ఉచిత శిక్ష‌ణ‌-ఐ.టి.డి.ఏ

0
29

నెల్లూరుః నెల్లూరు ప‌రిధిలోని ప్ర‌కాశం,చిత్తూరు,క‌డ‌ప జిల్లాలో గిరిజ‌న యానాదుల‌కు ఇంట‌ర్మీడియ‌ట్‌(ఎం.పి.సి)గిరిజ‌న కులాల వారు డిప్లొమో-బి.టెక్ సివిల్ పాసైన నిరుద్యోగ యువ‌తీ,యువ‌కుల‌కు ట్రైబ‌ల్ కార్పొరేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుండి నేష‌న‌ల్ అకాడ‌మి ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌,హైదరాబాద్ లో 18 నెలల పాటు ఫీల్డులో ఉచిత శిక్ష‌ణ ఇవ్వ‌బ‌డుతుంద‌ని, జిల్లా ఐ.టి.డి.ఏ అధికారి బాలాజీ మంగ‌ళవారం తెలిపారు.శిక్ష‌ణాకాలంలో నెలకు 12 వేల రూపాయ‌లు స్టైఫండు,ఫీల్డు వ‌ర్కులో టి.ఏ.డి.ఎ కింద 3 వేల రూపాయ‌లు ఆద‌నంగా ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు.శిక్ష‌ణాంత‌రం ఎన్‌.ఏ.సి వారిచే స‌ర్టిఫీకేట్ ఇవ్వ‌బ‌డుతుంద‌న్నాఉ.ఆర్హ‌లైన గిరిజ‌న యానాదులు ఈనెల 28వ తేదిలోగా ధ‌ర‌ఖాస్తుచేసుకొవాల‌ని కోరారు.ఇత‌ర వివ‌రాల‌కై 8187899877 సంప్ర‌దించ‌వ‌చ్చాన్నారు.

LEAVE A REPLY