ప్ర‌పంచక‌ప్ పూట్‌బాల్ పండుగ రేప‌టి నుండి ప్రారంభం

0
101

అమ‌రావ‌తిః ప్ర‌పంచ క‌ప్ పూట్‌బాల్ పండుగ‌ జూన్ 14 నుంచి జూలై 15 వ‌రకు రష్యా వేదికగా జరుగుతున్నసంగతి తెలిసిందే.ఈ వరల్డ్ కప్‌కు రష్యా సర్వం సిద్ధం చేసింది.రష్యా వీధుల్లో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్‌ సందడే.ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే 32 జట్లు రష్యాకు చేరుకున్నాయి.ప్రపంచం నలువైపుల నుంచి సాకర్ అభిమానులు రష్యాకు చేరుకుంటున్నారు.ఈ వరల్డ్ కప్‌కు ఉగ్రవాదం,గుండాయిజంతో పొంచి ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.వరల్డ్ కప్‌కు వస్తోన్న అభిమానుల నేపథ్యాన్ని కూడా తనిఖీ చేస్తోంది.వరల్డ్ కప్ మ్యాచ్‌ల చూసేందుకు వచ్చే వివిధ దేశాల అభిమానులు 12 ఆతిథ్య నగరాల్లో ఎక్కడో ఒక చోట పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలని రష్యా ఆదేశాలు జారీ చేసింది.ఈ పుట్‌బాల్ వేడుక‌ల‌ను ప్రపంచ న‌లుమూల‌ల నుండి టి.విల ద్వారా దాదాపు 3.2 బిలియ‌న్ ప్ర‌జలు చూస్తార‌ని ఇంక ఎక్క‌వ మంది చూసిన ఆశ్చ‌ర్యం పోవాల్సిన పనిలేద‌ని ర‌ష్యా అధికారులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY