యురేనియం కోసం నెల్లూరుజిల్లాలో త్రవ్వకాలు !

నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యురేనియం నిల్వలు వున్నట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల వ్ద డేటా వుండడంతో పలు ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలంలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు భావిస్తున్నడిపార్టమెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనార్జీ సంస్థ పడమటి కంబంపాడు వద్ద అటవీ ప్రాంతంలో అన్వేషణకు రంగం సిద్ధంచేస్తుంది.ఇప్పటికే అక్కడికి యంత్ర పరికరాలు కూడా చేరుకున్నాయి.ఆటమిక్ మిరనరల్స్ డివిజిన్ ఆధ్వర్యంలో తవ్వకాలను పర్యవేక్షించనున్నట్టు సమాచారం.యురేనియం అన్వేషణ కార్యక్రమంను వ్యతిరేకిస్తు స్థానిక ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తమ పొలాలు,తాగునీటి వనరులతో పాటు ఆరోగ్యాలు దెబ్బతింటాయని అంటున్నారు.నల్లమల తరహాలో ఇక్కడ త్రవ్వకాలు వివాదాస్పదమవుతుందా ప్రజలు సర్దుకు పోతారా అన్నది వేచిచూడాలి ?